Tuesday, April 23, 2024
- Advertisement -

బాలిక లాంగ్ స్లీవ్స్ డ్రెస్‌ని క‌త్తిరించిన ఉపాధ్యాయుడు…

- Advertisement -

పరీక్షల్లో కాపీ జరగకుడా ఉండేందుకు అధికారులు పెడుతున్న నిబంధనలు విద్యార్ధులకు చుక్కలు చూపెడుతున్నాయి. ఓ బాలిక లాంగ్ స్లీవ్స్ డ్రెస్‌ వేసుకుని పరీక్ష రాసేందుకు రావడంతో, అలా రాకూడదంటూ ఉపాధ్యాయుడు వాటిని కత్తిరించ‌డంతో వివాదాస్ప‌ద‌మ‌య్యింది.

ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్‌లో చోటు చేసుకుంది. గతనెల 31న ప్రీ అగ్రికల్చర్ టెస్ట్ (సీజీ పాట్) నిర్వహించారు. తాను చాలా స్ట్రిక్ట్‌ అంటూ పరీక్షల్లో కాపీ కొట్టే చాన్సే ఇవ్వనంటూ ఓ ఉపాధ్యాయుడు గేటు వద్ద విద్యార్థులను తనిఖీలు చేసి లోపలికి పంపుతున్నాడు.

బాలిక అరచేతుల వరకు ఉన్న పొడవాటి డ్రెస్‌ వేసుకు రావడంతో అందులో చిట్టీలు పెట్టుకుని వచ్చిందేమోనన్న అనుమానంతో సదరు ఉపాధ్యాయుడు కత్తెరతో వాటిని కత్తించడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఆ బాలిక డ్రెస్‌నే కాకుండా చేతులవరకు నిండుగా ఉన్న వేసుకొని వ‌చ్చిన వారంద‌రినీ దుస్తులను ఇలాగే కట్ చేసినట్లు తెలిసింది. ఈ వివాదం క‌లెక్ట‌ర్ వ‌ర‌కు వెల్ల‌డంతో విచారణ జరిపి సదరు ఉపాధ్యయుడిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -