నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమ కంపెనీ బ్యాంకు అకౌంట్లను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయన కుటుంబానికి ప్రతికూల తీర్పు వచ్చింది. రఘురామకృష్ణంరాజు, ఆయన సతీమణి రమాదేవి, కుమార్తె ఇందిరా ప్రియదర్శినిపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్‌సభ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనతో పాటు ఆయన భార్య, కుమార్తె రుణాలు చెల్లించకుండా బ్యాంకులను మోసం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ విచారణ జరపాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉంటే.. రుణాలు చెల్లించని కంపెనీల బ్యాంకు ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాలని రిజర్వు బ్యాంకు సర్క్యులర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రఘురామకృష్ణంరాజు కంపెనీ కూడా ఈ లిస్టులో చేరింది. ఈ నేపథ్యంలో దీనిని సవాల్ చేస్తూ ఇండ్–భారత్తోపాటు, రాజు, ఆయన భార్య, కుమార్తె పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. వారిపై సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
నేనే నిర్మాత అయితే ‘ఉప్పెన’చేసేవాడిని కాదు
జానారెడ్డి పై.. ఓ రేంజ్ లో ఎర్రబెల్లి ఫైర్..!
డయాబెసిట్ ముందస్తు లక్షణాలు ఇవిగో ..!
వామ్మో విష్ణుప్రియ.. చూస్తే తట్టుకోలేరు..!