మందుబాబులకు షాక్. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లను బంద్ చేస్తూ యూనైటెడ్ బ్రేవరేజేస్ నిర్ణయం తీసుకుంది. టీజీ బీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడం కారణంగానే బీర్ల సరఫరాను నిలిపేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది. దీంతో ఏడు రకాల బీర్ల సరఫరా నిలిచిపోనుంది.
ఇందుకు సంబంధించి ఓ లేఖను రిలీజ్ చేసింది. 2019 నుంచి ధరలను సవరించకపోవడం వల్ల భారీ నష్టాలు వస్తున్నాయని బ్రూవరీస్ తన లేఖలో వెల్లడించింది.
దీంతో కింగ్ ఫిషర్ బీరు ప్రియులకు ఇది షాకనే చెప్పవచ్చు.
మార్కెట్‌లో ఎన్నో బీర్ కంపెనీలకు చెందిన బ్రాండ్లు అందుబాటులో ఉన్నా కింగ్ ఫిషర్‌కు ఉన్న డిమాండే వేరు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కింగ్ ఫిషర్ బీర్లు లభించడం లేదని కలెక్టర్లకు సైతం మందుబాబులు విన్నవించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కింగ్ ఫిషర్ బీరు బ్రాండ్ల సరఫరాను నిలిపివేస్తున్నామని యునైటెడ్ డ్రేవరేజేస్ ప్రకటించడంతో కేఎఫ్ వినియోగదారులు షాకేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
