Sunday, May 5, 2024
- Advertisement -

క‌ల్యాణ్ దేవ్ కోసం రంగంలోకి అల్లు అర్జున్‌

- Advertisement -

చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ విజేత సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచియ‌మైన సంగ‌తి తెలిసిందే. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా పై మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తుంది. క‌ల్యాణ్ దేవ్ మొద‌టి సినిమాతో ఫ‌ర్వాలేద‌నిపించుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళ‌విక నాయ‌ర్ న‌టించింది. సినిమా విడుదలయిన మర్నాడు హీరో చిరంజీవి మీడియా ముందుకు వచ్చి, సినిమా మంచి చెడ్డలు మాట్లాడారు. తాజాగా క‌ల్యాణ్ దేవ్‌కు స‌పోర్టుగా స్టయిలిష్ స్టార్ బన్నీ వస్తున్నారు.

విజేత సక్సెస్ మీట్ పేరిట ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ మీట్ కు బన్నీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. విజేత తొలి రోజు కలెక్షన్లు కాస్త డల్ గా వున్నా, శని, ఆదివారాలు కాస్త పికప్ అయ్యాయి.మెగా ఫ్యామిలీ మొత్తం క‌ల్యాణ్ దేవ్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారు. ఉపాసన సోషల్ మీడియాలో సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ చేసారు. మిగిలిన హీరోలు కూడా పబ్లిసిటీలో పాలు పంచుకుంటారేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -