Tuesday, May 14, 2024
- Advertisement -

బాబును ఈ సినిమా వాళ్లు ఆకాశానికెత్తేశారు..!

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సినిమా వాళ్లలో ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. అసలుకు తెలుగుదేశం పార్టీకే సినిమా వాళ్లలో క్రేజ్ ఎక్కువ. ఆ  పార్టీ ఆవిర్భావం నుంచి సినిమా వాళ్ల అండదండలు దానికే ఉంటున్నాయి.

ఇక బాబు గారికి ప్రచార ఆర్భాటం ఎక్కువ కావడంతో.. సినిమావాళ్లను మరింతగా ఆదరించారు. దీంతో అప్పటి నుంచి సినిమా వాళ్లకూ, తెలుగుదేశం పార్టీకీ బంధం ఏర్పడి కొనసాగుతూ వస్తోంది.

ఇక ఇలాంటి పార్టీఅధికారంలో ఉన్న సమయంలో సినిమా వాళ్లు ఈ పార్టీని మరింతగా పొగిడేస్తారని వేరే చెప్పనక్కర్లేదు. తాజాగా అదే జరిగింది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆకాశానికెత్తేశారు సినిమా వాళ్లు. బాబును వీరుడు, శూరుడు అని ఆయన.. ఏపీ బాహుబలి అని వారు ప్రశంసలు  కురిపించారు. సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ బాబును అమితంగా ప్రశంసించాడు. బాబును ఏపీ బాహుబలి అని పొగిడేశాడు గోపాల కృష్ణ.

గోదావరి పుష్కర ఏర్పాట్లు అద్భుతం అని.. వాటి నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం విజయవంతం అయ్యిందని ప్రశంసించిన గోపాల కృష్ణ ఈ విధంగా బాబును బాహుబలిగా చేసేశాడు. మరి పుష్కర నిర్వహణలో ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల తొలి రోజే తొక్కిసలాట జరిగి.. 29 మంది మరణించారు. ఆ విషయాన్ని మరిచిపోయారో.. లేక ప్రస్తావిస్తే బాగుండదు అనుకొన్నారో కానీ.. ఈ సినిమా వాళ్లు మాత్రం పుష్కర ఏర్పాట్లు అదర్స్ అని ఈ విషయంలో బాబు గారు విజయవంతం అయ్యారని పొగడ్తల్లో ముంచేశారు. మరి వీళ్లకు నచ్చితే ఇలాగే పొడిగేస్తారు కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -