Wednesday, May 8, 2024
- Advertisement -

శాటిలైట్ రైట్స్ విషయంలో రాంచరణ్ సినిమా సరికొత్త రికార్డు!

- Advertisement -

మెగా పవర్ స్టార్ తాజా సినిమా విడుదల తేదీ దగ్గరపడక ముందే టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. విడుదలకు ఇంకా నెలల కొద్దీ సమయం ఉన్నా.. ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకముందే. .ఇంకా ఆడియో విడుదల, సినిమా విడుదల తేదీల గురించి క్లారిటీ రాకముందే ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో రాంచరణ్ సినిమా ఒకటి రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఇది శాటిలైట్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్డును సృష్టించింది.

ఈ సినిమా టెలికాస్ట్ రైట్స్ ను జీ తెలుగు కొనుక్కొన్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా 13 కోట్ల రూపాయలు వెచ్చించి.. ఈ సినిమా ను ఆ టెలివిజన్ వారు సొంతం చేసుకొన్నట్టుగా  సమాచారం. శ్రీనువైట్ల దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా విషయంలో ఇది పెద్ద పాజిటివ్ న్యూస్. వైట్ల గత సినిమా ప్లాఫ్ అయ్యింది. అయితే ఈ సారి ఆ దర్శకుడు చరణ్ ను హీరోగా పెట్టి సినిమా రూపొందుతుండటం… దీనికి వైట్లతో కలిసి గతంలో హిట్స్ కొట్టిన కోన వెంకట్ వంటి రచయితలు పనిచేస్తుండటంతో.. ఫుల్ క్రేజ్ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రికార్డు స్థాయి ధర పలికాయి. మరి విడుదలకు ఇంకా చాలా దూరంలో ఉండగానే.. చరణ్ సినిమా ఇలా రికార్డులను బ్రేక్ చేయడం అంటే.. విడుదల అయ్యే సమయానికి ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -