Sunday, May 4, 2025
- Advertisement -

టిక్‌టాక్‌ మొబైల్ యాప్ యూజ‌ర్ల‌కు బిగ్ షాక్‌..నిషేధం దిశ‌గా అడుగులు

- Advertisement -

సోష‌ల్ మీడియాలో ఇప్పుడు యవ‌త‌, చిన్నారుల‌ను ఆక‌ట్టుకుంటు టిక్ టాక్ యాప్ దేశ వ్య‌ప్తంగా బాగా పాపుల‌ర్ అయ్యింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తిఒక్క‌రూ చిన్నా, పెద్దా అనే తేడాల‌కేండా దీన్ని ఉప‌యోగిస్తున్నారు. తమ అభిమాన హీరోల డైలాగ్స్ను తామే కొట్టినట్లు కొన్ని హిట్టు సాంగ్స్ కు డ్యాన్స్ లు చేస్తూ వీడియోలను పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ యాప్‌ను కొంద‌రు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. అబ్బాయిల కంటె అమ్మాయిలే దీన్ని ఎక్కువ‌గా యాజ్ చేస్తున్నారు. కొందరు ఒకడుగు ముందుకేసి అశ్లీల డ్యాన్సులు చేసి యాప్లో పెడుతున్నారు. ఫలితంగా యువత దానిని అనుకరిస్తూ పెడదారి పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.

యువ‌త‌ను త‌ప్పు దోవ ప‌ట్టిస్తున్న ఈయాప్‌ను నిషేధించాల‌ని మ‌ద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ యాప్‌తో అశ్లీల కంటెంట్‌ వ్యాప్తి అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చైనాకు చెందిన వీడియో షేరింగ్‌ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌పై నిషేధం విధించాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 16లోగా ఏ విషయమైనా తెలియజేయాలని కోరారు.

టిక్‌టాక్‌ యాప్‌తో రూపొందిన అస్లీల వీడియోలను ప్రసారం చేయరాదని బెంచ్‌ మీడియా సంస్థలను కూడా ఆదేశించింది. యువత వ్యక్తిగతంగా తమ ప్రతిభను భయటపెట్టడానికి యాప్ ఉపయోగపడినా అదే సమయంలో ఎక్కువగా అశ్లీలతను ప్రోత్సహిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ యాప్ తో అమ్మాయిల భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్న సంఘాలు టిక్ టాక్ యాప్ నిషేధించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయన్నారు. అందువల్ల ఈ యాప్ను త్వరలోనే నిషేధించేందుకు చర్యలు కేంద్రం తీసుకుంటుందా అన్న‌ది చూడాలి. మ‌రో వైపు ఈ యాప్‌ను ఇదే కారణంతో ఇండోనేషియా, బంగ్లాదేశ్‌ల్లో నిషేధిం విధించించారు అక్క‌డి ప్ర‌భుత్వాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -