Saturday, April 27, 2024
- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సీరియస్

- Advertisement -

దేశంలో కరోనా విజృంబిస్తున్న వేళ ర్యాలీలకు అనుమతి ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని సిజె వ్యాఖ్యనించారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ రాజ‌కీయ పార్టీల ర్యాలీల‌కు అనుమ‌తించిన ఈసీ అధికారుల‌పై హ‌త్య కేసు న‌మోదు చేయాల్సింద‌ని వ్యాఖ్యానించింది.

త‌మిళ‌నాడులోని క‌రూర్ నియోజ‌క‌వ‌ర్గం పోలింగ్ సంద‌ర్భంగా క‌రోనా నియ‌మాలు పాటించేలా చూడాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిషిన్‌పై మ‌ద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెనర్జీ, జస్టిస్ సెంటిల్‌కుమార్ రామమూర్తితో కూడిన తొలి ధ‌ర్మాస‌నం సోమ‌వారం విచార‌ణ జ‌రిగింది. ఈ సందర్భంగా కోవిడ్ రెండో దశకు ఎన్నికల సంఘానిదే బాధ్యతని మద్రాస్ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.

ఎన్నికల ప్రచారంలో కరోనా ఆంక్షల అమలులో ఇసి విఫలమైందని హైకోర్టు పేర్కొంది. ప్రచారాల వేళ ఎన్నికల అధికారులు వేరే గ్రహంలో ఉన్నారా..? అని సిజె ప్రశ్నించారు. ఓట్ల లెక్కింపు రోజైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏప్రిల్ 30లోగా లెక్కింపు ప్రణాళిక అందివ్వాలని కోరింది. ప్రణాళిక ఇవ్వకపోతే ఓట్ల లెక్కిపు ఆపేస్తామని కోర్టు హెచ్చరించింది.

ఎంత కష్టం.. కరోనా సోకిన భర్త.. ఆ భార్య ధైర్యం చూస్తే కన్నీరు పెట్టుకుంటారు..

కర్నాటకలో 14 రోజుల లాక్‌డౌన్!

రకుల్ ను మిస్ అవుతున్న మంచులక్ష్మీ.. ఆ ఫొటోతో ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -