- Advertisement -

సూపర్ స్టార్ రజినీకి సమన్లు.. కారణం అదేనా?

- Advertisement -

ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటూ తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టి రానున్న ఎన్నికల్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి వస్తున్నానంటూ కొద్ది రోజుల కిందట ప్రకటన చేసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలంటూ 2018లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. 

ఆ సమయంలో పెద్ద గొడవ కావడం.. పోలీసులు కాల్పులకు పాల్పడగా 13 మంది మృతి చెందారు. ఆ సమయంలో రజనీకాంత్‌ ఈ ఘటనపై స్పందిస్తూ.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని వ్యాఖ్యానించారు. దీనికి గురించి ఆయనను ప్రశ్నించగా.. ఎలా తెలిసిందో నన్ను అడగకండి.. నాకు అన్నీ తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఈ వ్యవహారంలో ఏకసభ్య కమిషన్‌ రజనీకాంత్‌కు ఇప్పటికే ఒకసారి సమన్లు జారీ చేసింది.   కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆలస్యమైన దర్యాప్తును మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఇటీవల మళ్లీ వేగవంతం చేసింది. రజనీకాంత్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -