Tuesday, May 7, 2024
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ గా పోటీ…

- Advertisement -

రాజ‌కీయాలలో సినీ గ్లామ‌ర్ పెరిగిపోతోంది. ఈ రెండు రంగాల‌కు ఎప్ప‌టినుంచె అవినాభావ సంబంధం ఉంది.సినిమాల‌నుంచి రాజ‌కీయీల్లోకి వ‌చ్చి ముఖ్య‌మంత్రులు అయ్యారు. తెలుగు సినిమా రంగంనుంచి ఎంత‌మంది రాజ‌కీయీల‌ల్లోకి వ‌చ్చ‌రొ తెలిసిందే.ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్‌లోకి స్టార్ ప్రొడ్యూస‌ర్ చేరుతున్న‌ట్లు తెలుస్తోంది.

స్టార్ ప్రొడ్యూస‌ర్‌ల‌లో ఒక‌ర‌యిన దిల్‌ రాజు టిఆర్ఎస్‌లోకి చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది..దిల్‌ రాజును తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వనించినట్టు సమాచారం. నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నందున ఆమె సీటును దిల్ రాజును ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిార్ సిద్దంగా ఉన్నారని కూడ ప్రచారం సాగుతోంది.

పార్టీకి సినీ గ్లామర్‌ను తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగానే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకొని దిల్ రాజుకు ఆఫర్ ఇచ్చినట్టు టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఆఫర్‌పై దిల్ రాజు కూడ కొంత సానుకూలంగానే స్పందించారని సమాచారం.అన్నీ సక్రమంగా సాగితే 2019 ఎన్నికల్లో దిల్ రాజు టిఆర్ఎస్ తరపున నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసే అవకాశాలున్నాయని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయమై దిల్ రాజు నుండి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -