- Advertisement -
రీసెంట్ గా అమెరికా 45 వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. లక్షలాదిగా అమెరికన్లు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఛానెల్ CNN ఓ అద్భుతమైన ఫోటో తీసింది.
గిగాపిక్సెల్ కెమెరా సాయంతో 360 డిగ్రీల కోణంలో ఓ ఫొటోను తీసింది. ఈ ఫొటో ప్రత్యేకత ఏంటేంటే …. ఫొటోలో ఉన్న ఎవర్ని జూమ్ చేసినా వారి ముఖాన్ని స్పష్టం గా చూడవచ్చు. కనుచూపు మేర విస్తరించిన ఉన్న లక్షలాది జనాభాలో ఎవరి ముఖమైనా స్పష్టంగా కన్పిస్తుంది. ఆల్ట్రా హై రిసొల్యూషన్ తో తీసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా ఫొటోపై క్లిక్ మ్యాజిక్ ని చూసి ఎంజాయ్ చేయండి.
http://edition.cnn.com/interactive/2017/01/politics/trump-inauguration-gigapixel/