ట్రంప్ కి మారో దెబ్బ.. హ్యాండ్ ఇచ్చిన యూట్యూబ్..!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్ ట్రంప్​ ఖాతాను తాత్కాలికంగా నిషేధించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇటీవల పార్లమెంటులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.కామెంట్​ సెక్షన్​ను కూడా తొలగించామని స్పష్టం చేసింది యూట్యూబ్. అయితే ఆ వీడియోలో ఏ అంశాలను పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నారో అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ట్రంప్​ ఖాతాలో తాజాగా అప్లోడ్​ అయిన ఓ వీడియోను తొలగించాము. అది మా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. తొలి ఉల్లంఘన కావడం వల్ల ఏడు రోజుల పాటు ఖాతాపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నాము అని యూట్యూబ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...