Monday, May 12, 2025
- Advertisement -

ఒక వైపు ట్రంప్‌..మ‌రో వైపు పుతిన్ మ‌ధ్య‌లో మోదీ..

- Advertisement -

భాజాపా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దేశ విదేశాంగ విధాన‌మే మారిపోయింది. అగ్ర రాజ్యాల‌తో సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌డంలో మోదీ కొంత వ‌ర‌కు విజ‌యం సాధించారు. అంత‌ర్జాతీయంగా భార‌త్ ప్రాధాన్య‌త పెరిగింది. రెండు అగ్ర‌రాజ్యాలు భార‌త్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. అక్టోబర్ 4, 5 తేదీల్లో ఆయన రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించ నున్నారు. 19వ భారత-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు కోసం పుతిన్‌ ఢిల్లీకి విచ్చేస్తు న్నారు. రాష్యా, ఇండియా స్నేహ సంబంధాల గురించి తెలిసిందే.

పుతిన్ పర్యటన వివరాలను భారత విదేశాంగ శాఖ శుక్రవారం (సెప్టెంబర్ 28) ఓ ప్రకటనలో తెలిపింది. పుతిన్ భారత పర్యటన సందర్భంగా భారత్, రష్యా పలు అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకో నున్నాయి. భారత్ – రష్యా సంబంధాలు, సమకాలీన అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించ నున్నారు. భారత్ – రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Image result for putin and Modi

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వార్తలు జోరందుకున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారని, అందుకు సమయం కోసం ఆయన ఎదురుచూస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

Image result for trump and modi

అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఢిల్లీలో జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిధిగా డొనాల్డ్ ట్రంప్ పాల్గొనవచ్చని తెలుస్తోంది. భారత్ అమెరికా సంబంధాలు మరింత పటిష్ట పర్చడంలో భాగంగా ట్రంప్ ఇండియా టూర్ ఉంటుందని… భారత్‌లో పర్యటించేందుకు ట్రంప్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ రీజియన్ అధికారి ఎలిస్ వెల్స్ అన్నారు. అయితే ఇండియాలో ట్రంప్ టూర్ ఎప్పుడు ఉండొచ్చనే దానిపై మరిన్ని వివరాలు తన దగ్గర లేవని అమె వెల్లడించారు. దీన్ని బ‌ట్టి చూస్తే ఆసియాలో భార‌త్ అవ‌స‌రం ఎంత వుందో తెలుస్తోంది. రెండు అగ్ర‌రాజ్యాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. మ‌రి మోదీ రెండు దేశాల‌తో ఎలాంటి దౌత్య విధానాలు అవ‌లంబిస్తార‌నేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -