Monday, May 5, 2025
- Advertisement -

హిందీకి వ‌త్తాసు ప‌లికిన తెలుగు తేజం

- Advertisement -

అత‌డి రూపం చూస్తే తెలుగు వ్య‌క్తిగా అభివ‌ర్ణిస్తారు. పంచక‌ట్టు, తెల్ల‌చొక్కాతో ఎక్క‌డికి వెళ్లి అదే వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఉండ‌డంతో అంద‌రూ ఆయ‌న్ను తెలుగు వారి సంస్కృతిని చాటుతున్నారు అని చెబుతారు. ఢిల్లీలో కీల‌క భూమిక పోషించే ఆయ‌న త‌న క‌ట్టుబొట్టుతో తెలుగు వారి కీర్తిని దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని పేర్కొంటున్నారు. అది వాస్త‌వ‌మే! కానీ ఇప్పుడు ఆ వ్యక్తే ఏకంగా హిందీ భాష మాట్లాడాలని, హిందీని త‌ప్పనిస‌రిగా చెప్ప‌డం తెలుగు వారు ఆశ్చ‌ర్యానికి గురవుతున్నారు. ఆయ‌నే మ‌న ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు.

ఆయ‌న ఉప రాష్ట్ర‌ప‌తిగా అయిన‌ప్ప‌టి నుంచి తెలుగు రాష్ట్రాల‌కు దూర‌మ‌య్యారు. ఇప్పుడు హిందీపై ప్రేమ పెంచుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. బుధ‌వారం (ఏప్రిల్ 4) ఢిల్లీలో జ‌రిగిన ఓ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

‘‘ప్రతి రాజ్యసభ సభ్యుడు హిందీ భాషలో తప్పనిసరిగా మాట్లాడాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం కాపాడాలంటే ప్రతి భారతీయుడు తమ మాతృభాషతోపాటు ఏదైనా ఒక భారతీయ భాష నేర్చుకోవాలని సూచించారు. హిందీని ప్రచారం చెయ్యడానికి బదులు.. ప్రతి ఒక్కరు ఆ భాషను తరచుగా ఉపయోగించాలని కోరారు. రోజూవారి కార్యకలాపాలలో హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -