Saturday, April 27, 2024
- Advertisement -

వెంకయ్య తప్పుకున్నాడా ? తప్పించరా ?

- Advertisement -

భారత జనత పార్టీలో వెంకయ్య నాయుడు స్థానం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. బీజేపీ తరుపున ఆయన సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. దక్షిణాదిలో అనగా ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ బలపడడంలో వెంకయ్య కీలక పాత్ర పోషించాడు. 1990 లలో పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు చేపట్టి బీజేపీ కి తలలో నాలుకలా మారారు. పార్టీ అధికార ప్రతినిధిగా, కేంద్ర ఎన్నికల కమిటీ చైర్మెన్ గా ఇలా ఎన్నో బాధ్యతల్లో తనదైన మార్క్ చూపిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాజ్య సభకు నాలుగు సార్లు ఎంపికైన ఒకే ఒక్క బీజేపీ నేతగా వెంకయ్య నాయుడు కు పేరు ఉంది. రాజ్యసభలో ప్రతిపక్షాలపై విమర్శనస్త్రాలు సంధించడంలో వెంకయ్య రూటే వేరు.

మరి ఈ స్థాయిలో బీజేపీ కి ప్రాణం పోసిన వెంకయ్య బీజేపీ కి దురమౌతున్నారా ? అంటే అవుననే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉప రాష్ట్రపతి రేస్ లో వెంకయ్య లేకపోవడమే. ఇప్పటికే ఉపరాష్టపతిగా కొనసాగుతున్న వెంకయ్య నాయుడు రెండవ సారి కూడా ఉపరాష్ట్రపతి గా కొనసాగే అవకాశం ఉందని కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక నొక టైంలో రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య పేరే గట్టిగా వినిపించింది. అయితే ఊహించని రీతిలో ఎన్డీయే కూటమి ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ఉప రాష్ట్రపతి విషయంలో కూడా వెంకయ్య నాయుడికి షాక్ ఇచ్చింది ఎన్డీయే కూటమి. అనూహ్యంగా జగదీప్ దన్ ఖడ్ ను ఎన్డీయే తరుపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు మోడి..

దీంతో వెంకయ్యను మోడి మెల్లమెల్లగా రాజకీయాలకు దూరం చేస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ కి ఒకప్పుడు మెయిన్ పిల్లర్స్ గా నిలిచిన ఎల్కే అద్వానీ, మురలి మనోహర్ జోషి వంటి వారిని బీజేపీ కి దూరం చేయడంలో నరేంద్ర మోడి సక్సస్ అయ్యారు. అదే విధంగా వెంకయ్యను కూడా బీజేపీ కి పూర్తిగా దూరం చేసేందుకు మోడి సిద్దమయ్యారని జాతీయ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట ఉపరాష్ట్రపతిగా వెంకయ్యను ప్రకటించి రాజకీయ పదవులకు దూరం చేశారు. ఇప్పుడు రెండవ సారి అవకాశం ఇవ్వకుండా ఆయన రాజకీయ జీవితానికే చరమ గీతం పాడేందుకు మోడి సిద్దమైనట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. అయితే స్వయంగా వెంకయ్య నాయుడే సుధీర్ఘ రాజకీయాలకు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకోవలని భావిస్తున్నారట. ఏది ఏమైనప్పటికి వెంకయ్య నాయుడు విషయంలో నరేంద్ర మోడి వైఖరి హాట్ టాపిక్ గానే ఉంది.

ఇవి కూడా చదవండి

సోనియా ప్రణాళికలు.. రాహుల్ విదేశీ యాత్రలు !

సరిహద్దు రచ్చ.. సద్దుమనిగేనా ?

జగన్ అప్పులు.. రాష్ట్రం తిప్పలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -