Friday, May 17, 2024
- Advertisement -

విన్నారా.. ఎక్కడికీ పారిపోలేదట!

- Advertisement -

విజయ్ మాల్యా. ప్రస్తుతం దేశంలో ఎవరి నోట విన్నా.. ఈయన మాటే బాగా వినిపిస్తోంది. బ్యాంకులకు వేలకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి.. ప్రస్తుతం ఎంచక్కా విదేశాలలో చక్కర్లు కొడుతున్నాడు.. ఈ వెటరన్ లవర్ బాయ్. పేరుకు పార్లమెంట్ సభ్యుడే అయినా.. దేశ గౌరవాన్ని మంటగలిపేలా.. ఎవరికీ సమాచారం లేకుండా.. హాయిగా విదేశాలకు వెళ్లిపోయాడు. ఈ ఇష్యూ.. పెద్ద వివాదంగా మారింది. మీడియాలో ఎక్కడ చూసినా.. ఇవే వార్తలు కనిపిస్తున్నాయి.

దీంతో.. ఎగిరిపోయిన పిట్ట.. ట్విటర్ లో కూయడం మొదలు పెట్టింది. తాను ఓ బాధ్యతాయుత ఎంపీనని.. దేశమన్నా.. దేశంలోని చట్టాలన్నా గౌరవం ఉందని విజయ్ మాల్యా.. ట్విటర్ లో చెప్పుకొచ్చారు. ఓ అంతర్జాతీయ బిజినెస్ మన్ గా.. విదేశీ టూర్లు చేయాల్సి వస్తుందనీ..అంతే తప్ప దేశం విడిచి వెళ్లాననే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదనీ తేల్చేశారు.

అయితే.. ఎక్కడున్నదీ.. ఏం చేస్తున్నదీ.. విజయ్ మాల్యా చెప్పలేదు. దేశంపై గౌరవం ఉందన్న ఆయన.. అసలు ఇంత సడన్ గా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందీ వివరించలేదు. దీంతో.. ఆయన్ను తప్పుబట్టంలో ఏ మాత్రం తప్పు లేదని క్రిటిక్స్ అంటున్నారు. నిజంగా దేశంపై గౌరవం ఉన్న వ్యక్తే అయితే.. ఎక్కడున్నదీ క్లియర్ గా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -