Sunday, May 12, 2024
- Advertisement -

విదేశాల్లో విరుష్క జోడీ పెళ్లంట‌

- Advertisement -

కుటుంబంతో స‌హా విదేశాల‌కు ఇరు కుటుంబాలు

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ ఇద్ద‌రూ పెళ్లి చేసుకోనున్నారంట‌. వారిద్ద‌రి కుటుంబాలు నిన్న విదేశాల‌కు వెళ్లిపోయారు. బాలీవుడ్ తోపాటు క్రికెట్ ప్రపంచం మొత్తం వీళ్లద్దరి పెళ్లి వార్తనే హాట్ టాపిక్ అయ్యింది. కోహ్లీ – అనుష్క పెళ్లికి మా స్టేడియం సిద్ధంగా ఉంది అని ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ స్టేడియం ఇన్‌చార్జి ప్రకటించటం మరింత ఆస‌క్తి రేపుతోంది.

అనుష్క శర్మ కుటుంబం మొత్తం గురువారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. పెళ్లి గురించి అనుష్క‌ను మీడియా అడిగితే థాంక్యూ థాంక్యూ అంటూ వెళ్లిపోయింది. ఆమె వెంట వాళ్ల కుటుంబ‌స‌భ్య‌లు వ‌చ్చారు. ఇప్ప‌టికే విరాట్ కోహ్లీ కుటుంబ‌స‌భ్యులు ఫారిన్ వెళ్లార‌ని తెలుస్తోంది. అయితే పెళ్లి ఇటలీ, స్విట్లర్లాండ్‌ల‌లో జ‌రగ‌బోతోంద‌ని టాక్‌.

తన ప్రేయసి, బాలీవుడ్‌ భామ అనుష్క శర్మను కోహ్లీ విహ‌హం ఖాయ‌మైన‌ట్టే. తాజాగా బీసీసీఐ శ్రీలంకతో వన్డే, టీ20 కోసం ప్రకటించిన జట్టులో విరాట్ ఎంపిక కాలేదు. త్వరలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అందుకే విరాట్‌కు విశ్రాంతి కల్పించాం అని బీసీసీఐ తెలుపుతోంది. మరోపక్క మాత్రం పెళ్లి కోస‌మే కోహ్లీ త‌ప్పుకున్నాడ‌ని స‌మాచారం.

డిసెంబర్‌ 9, 10, 11, 12 తేదీల్లో ఇటలీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే స్నేహితులు పెళ్లి కోసం టిక్కెట్లు కూడా బుక్‌ చేసేసుకున్నారట. ఇటలీలో జరిగే పెళ్లి తంతుకు ఏ క్రికెటర్‌ హాజరు కావడంలేదు. క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 21న ముంబయిలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేసిన్నట్లు సమాచారం. అయితే ఈ పెళ్లి వార్తలపై ఇరువురి కుటుంబసభ్యులు ఖండించ‌క‌పోవ‌డం వీటికి బ‌లం చేకూరుతోంది. అయితే అనుష్క, ఆమె కుటుంబం ఫారిన్ వెళ్తున్న వీడియోలు మ‌న‌కు దొరికాయ్ చూడండి

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -