Tuesday, May 14, 2024
- Advertisement -

పాపం యాంక‌ర్ ర‌వి

- Advertisement -

విడుద‌ల కాని ‘ఇది మా ప్రేమ కథ’ సినిమా

బుల్లితెరపై వెలుగుతున్న యాంక‌ర్ ర‌వి సినీ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు. అలా వ‌చ్చిన సినిమా అవ‌కాశం వ‌చ్చింది. అయితే ఆ సినిమా విడుద‌ల రోజురోజుకు వాయిదా ప‌డుతోంది. దీనిపై ర‌వి నిరాశ‌లో ఉన్నాడ‌ని తెలుస్తోంద‌. ప్ర‌స్తుతం ప‌టాస్‌తో పాటు ప‌లు టీవీ షోల‌లో క‌నిపిస్తున్నాడు.

హీరోగా ర‌వి ‘ఇది మా ప్రేమ కథ’తో వస్తున్నాడు. “శశిరేఖా పరిణయం” సీరియల్ ఫేమ్ మేఘన లోకేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మత్స్య క్రియేషన్స్, పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థల ఆధ్వ‌ర్యంలో సినిమా వ‌స్తోంది. అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీత అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాను ఈ రోజు రేపు విడుద‌ల చేస్తామంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు.

డిసెంబర్ 8వ తేదీన విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించి చివ‌రికి సాంకేతిక కార‌ణాల వ‌ల్ల సినిమా విడుద‌ల వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పి.ఎల్.కె.రెడ్డి మాట్లాడుతూ.. పాపులర్ యాంకర్ రవి హీరోగా పరిచయమవుతూ నటించిన ‘ఇది నా ప్రేమకథ’ చిత్రం మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఆ నమ్మకంతోటే ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదలకు ప్లాన్ చేశామని అయితే ఎడిటింగ్‌లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. త్వరలోనే విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -