Wednesday, May 7, 2025
- Advertisement -

జ‌గ‌న్‌పై క‌త్తిదాడి కేసులో మ‌రోసారి సంచ‌ల‌విష‌యాలు వెల్ల‌డించిన విశాఖ సీపీ..

- Advertisement -

అక్టోబర్‌ 25న జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడికి సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు విశాఖ సీపీ మ‌హేష్ చంద్ర ల‌డ్డా . నిందితుడు శ్రీనివాస్‌ వెల్డర్‌గా, కేక్‌ మాస్టర్‌గా, కుక్‌గా పలు చోట్ల పనిచేశాడని సీపీ తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారమే వైకాపా అధినేత జగన్‌పై నిందితుడు శ్రీనివాస్‌ దాడి చేశాడని వెల్ల‌డించారు.

జ‌గ‌న్‌ను హ‌త్య చేయ‌డానికి నిందితుడు రెండు సార్లు ప్ర‌య‌త్నించార‌ని తెలిపారు. అక్టోబ‌ర్ 18నే జ‌గ‌న్ హ‌త్య‌కు శ్రీనివాస్ ప్లాన్ వేశాడ‌న్నారు. నిందితుడు శ్రీనివాస్‌ వెల్డర్‌గా, కేక్‌ మాస్టర్‌గా, కుక్‌గా పలు చోట్ల పనిచేశాడని సీపీ తెలిపారు. దాడి జరిగిన రోజున నిందితుడు శ్రీనివాస్‌ కోడికత్తికి రెండు సార్లు సాన ప‌ట్టించాడ‌ని దీన్ని…అతడి సహచరులు కూడా చూశారని చెప్పారు.

దాడి జరిగిన రోజు పక్కా ప్రణాళికతో ఇంటి నుంచి శ్రీనివాస్‌ ఉదయం 4.55 గంటలకే బయల్దేరాడని చెప్పారు. ఉదయం 8 గంటలకు హేమలత, షేక్‌ అమ్మాజీ అనే మహిళలకు ఫోన్‌ చేసి ‘ఈ రోజు నన్ను టీవీలో చూస్తారు’ అని శ్రీనివాస్‌ చెప్పాడని సీపీ పేర్కొన్నారు

2017 జనవరిలో జగన్‌తో ఉన్న ఫ్లెక్సీని తయారు చేయించాడని, అక్టోబర్‌ 18నే జగన్‌పై దాడి చేసేందుకు శ్రీనివాస్ ప్రణాళిక వేశాడని చెప్పారు. అయితే, అక్టోబర్‌ 17నే జగన్‌ హైదరాబాద్‌ వెళ్లడంతో అది సాధ్యపడలేదని లడ్డా వెల్లడించారు. ముందు రోజు ప్లాన్ ఫెయిల్ అయిన కారణంగానే పక్కాగా అక్బోబర్ 23వ తేదీన నిందితుడు శ్రీనివాస్ అమలు చేసినట్లు లడ్డా అభిప్రాయపడ్డారు . ప‌ధ‌కంలో భాగంగానే విజ‌య‌దుర్గ‌తో ఓలేఖ‌ను రాయించి పెట్టార‌న్నారు. ఆ లేఖ‌ను విజ‌య‌దుర్గ జిరాక్స్ చేయించి పెట్టింద‌న్నారు. విజ‌య‌దుర్గ మీద 164 సెక్స‌న్ కింద స్టేట్ మెంట్లను రికార్డు చేశామ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -