Monday, April 29, 2024
- Advertisement -

రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వానికి హైకోర్టు నోటీసులు…

- Advertisement -

ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి కేసుపై హైకోర్టు ఏపీ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే కేసును రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ జరిపారని మండిపడింది. కేసును ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించిన కోర్టు.. జాతీయ దర్యాప్తు సంస్థకు కేసును ఎందుకు బదిలేదో చేయలేదో కారణాలు తెలియ జేస్తూ అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

దాడి ఘటనపై ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్ ) విచారణను నిలిపివేయాలని కోర్టుకు జగన్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. దీంతో జగన్ లాయర్ వాదనల్ని ఖండించారు ఏపీ ప్రభుత్వ న్యాయవాది. సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జగన్‌పై హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించే విషయంలో అభిప్రాయాల్ని తెలియజేయాలంటూ సూచించింది. తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్‌5కు వాయిదా వేసింది.

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఏపీ పోలీసుల పరిధి నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసేలా ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం వాదనలు విన్నది. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి కావాలనే ఏపీ ప్రభుత్వం విచారణను తమ పరిధిలో సాగిస్తుందని కోర్టుకు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -