Friday, May 3, 2024
- Advertisement -

విశాఖలో జిల్లాలో దారుణం….అమ్మాయి గొంతు కోసిన ప్రేమోన్మాది

- Advertisement -

విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదనె కారణంతో నడిరోడ్డుపైనే ప్రేమోన్మాది విద్యార్థిని భార్గవిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె మెడక, చాతికి తీవ్ర గాయాలుకాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

వివరాల్లోకి వెల్తే…విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లిలో స్థానిక కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విశ్వభార్గవిని తనను ప్రేమించమంటూ కొన్ని రోజులుగా సాయి కిరణ్ అనే కుర్రాడు వేధిస్తున్నాడు. తన వెంట పడుతున్నఅతన్ని విశ్వభార్గవి పట్టించుకోకపోవడంతో రగిలిపోతున్న సాయి ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఈ రోజు కాలేజీ ముగిసిన త రువాత ఆమె ఇంటికెళ్లేందుకు రోడ్డుపై నడుస్తుండగా.. వెనక నుంచి వచ్చిన అతను అమ్మాయిని కత్తితో పొడిచాడు. నడుము, మెడ భాగంలోనూ తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని స్థానికులు అడ్డుకొని దేహశుద్ధి చేశారు. ఘటనకు సంబంధించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -