Friday, March 29, 2024
- Advertisement -

టీడీపీలో కనిపించని కీలక నేత…నారాయణా ఎ కడా….?

- Advertisement -

ఒక పక్క రోమ్ తగలబడుతుంటే మరో పక్క నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్ల అనే సామెత టీడీపీ మాజీ మంత్రి నారాయణకు కరెక్ట్ గా సూటవుతుంది. ఏపీ రాజధాని అమరావతిపై కొద్దిరోజులుగా రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ,వైసీపీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. మరో వైపు టీడీపీ నేతలు రాజధాని తరలింపుపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.దీనిపై ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఓ నిర్ణయం ప్రకటించిన వెంటనే తమ కార్యాచరణ రూపొందించాలని భావిస్తోంది.

ఇంత జరుగుతున్నా టీడీపీ హయాంలో రాజధాని విషయంలో కీలక పాత్ర పోషించిన కీలక నేత, మాజీమంత్రి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరో కాదు నారాయణ. రాజధాని ఎంపికలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వరామకృష్ణణ్ కమిటీని పక్కనపెట్టి నారాయణ కమిటీ ద్వారా గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. దాదాపు 35 వేల ఎకరాలను సేకరించింది. దీంట్లో భారీ భూకుంభకోనం జరిగిందని ఎప్పటినుంచో వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారికి తోడు భాజాపా నేతలు కూడా దీనిపై విచారణ జరిపంచాలని డిమాండ్ చేస్తున్నారు.

మరో వైపు మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని ప్రాంతంలో టీడీపీకి సంబందించిన నేతలు బినామీల పేర్లతో భూములు కొన్నారని బొత్స ఆరోపించారు. ఇంత జరుగుుతన్నా మాజీమంత్రి నారాయణ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణాల విషయంలో అన్నీ తానై వ్యవహరించిన నారాయణ మౌనానికి కారణం ఏంటో టీడీపీ శ్రేణులకు కూడా అర్థంకావడం లేదు.

వైసీపీ ప్రభుత్వం తననే ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన సైలెంట్ అయిపోయారనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి ఏపీ నూతన రాజధాని అమరావతిపై మాజీమంత్రి నారాయణ ఎప్పుడు స్పందిస్తాన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. నారాయణ మీడియా ముందుకు వచ్చే గాని రాజధాని వ్వవహారం ఓకొలిక్కి వచ్చేలా లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -