Thursday, May 16, 2024
- Advertisement -

ఓటుకు నోటు కేసులో మ‌రో వీడియో….

- Advertisement -

హైద‌రాబాద్ నుంచి చంద్ర‌బాబును త‌ట్టా బుట్టా స‌ర్దేసుకొని అమ‌రావ‌తికి షిఫ్ట్ అయ్యేలా చేసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి…. మ‌రో సంచ‌ల‌న‌మైన వీడియో బ‌య‌టికి వ‌చ్చింది. ఈ వీడియోను ఎలా సంపాదించిందో తెలీదు కానీ ద‌క్క‌న్ క్రానిక‌ల్ ప‌త్రిక ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. మొదటి పేజీలో ఈ వార్త‌ను ప్ర‌చురించారు. ఇది జరిగి మూడేళ్ల తర్వాత డెక్కన్ క్రానికల్ తాజాగా ఈ కథనాన్ని ప్రచురించడం సంచలనంగా మారింది.

ఈ 11 నిమిషాల వీడియోలో రేవంత్ రెడ్డి – స్టీఫెన్ సన్ – సెబాస్టియన్ ల మధ్య జరిగిన సంభాషణలున్నాయి. ఈ వీడియోలో ఈ ముగ్గురు కూడా చాలాసార్లు బాబు అన్న పదాన్ని వాడారు. తెలంగాణలో ఇబ్బంది వస్తే ఏపీలో ఎమ్మెల్యేగా చంద్రబాబు అవకాశం ఇస్తారని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్ సన్ కు హామీ ఇచ్చినట్టు వీడియోలో ఉందని పత్రిక రాసింది. ఈ విషయంలో చంద్రబాబును ఒప్పించే బాధ్య‌త త‌న‌ద‌ని రేవంత్ అన్నట్టు పత్రిక తెలిపింది.

చంద్రబాబు స్టీఫెన్ సన్ ను కొనేందుకు మూడున్నర కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారని.. కానీ తానే రూ.5కోట్లకు పెంచానని స్టీఫెన్ సన్ తో సెబాస్టియన్ చెప్పినట్టు పత్రికలో వివరించారు. కేసీఆర్ సర్కారు చంద్రబాబు మోసాన్ని బయటపెట్టేందుకు స్టీఫెన్ సన్ ను పావుగా వాడి ఓటుకు నోటు స్కాంను అప్పట్లో బయటపెట్టడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ సదురు మొత్తం వీడియో లీక్ కావడం.. దాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలోనే ఈ వీడియో రిలీజ్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -