సుప్రీం కోర్టు ఎవ్వరూ ఊహించని విధంగా కంచె ఐలయ్యకు ఇచ్చిన తీర్పు అతనికి వేయి ఏనుగుల బలాన్నిచ్చింది. ఎట్ ది సేమ్ టైమ్ ఎందరినో ఆలోచనలో పడేసింది. ఒక వర్గం విషయంలో ఇలా ఇచ్చి.. మిగతా వర్గాల విషయంలో అత్యున్నత న్యాయస్థానాలు ఎందుకు ఇలాంటి తీర్పులనిస్తున్నాయో ఎవ్వరికీ అర్ధం కాకుండా ఉంది.
కంచె ఐలయ్యకు ఫేవర్ గా వచ్చిన తీర్పు చూసాక..అగ్రకులాల కుర్రాళ్లు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులతో ఉడికిపోతున్నట్లు స్పష్టమవుతుంది. ఇక మేము కూడా మా భావ ప్రకటన స్వేచ్ఛను చెప్పుకుంటాం.అయితే ఎస్ ఎస్ టి అట్రాసిటీ కేసులను ఇకపై పూర్తిగా నిషేదించాలని చెబుతున్నారు.
ఇంకొందరు ఇంకా ముందుకు పోయి… ఎవరికి వారు ఇలా పుస్తకాలు రాసుకుంటూ కులాలను డైరెక్ట్ గా అవమానిస్తుంటే,… దానిని బావ ప్రకటన స్వేచ్ఛగా ఎలా పరిగణించాలని కోర్టులను కొశ్చన్ చేస్తున్నారు. సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన కొన్ని తీర్పులను చూశాక… విసిగెత్తిన జనాలు
రాష్ట్రపతి స్వయంగా జోక్యం చేసుకుంటే గాని…మనం ఆశించిన ప్రజా క్షేమాలను అందుకోలేమని విన్నవించుకుంటున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి సోషల్ వ్యాసాలే కనిపిస్తున్నాయి.