Tuesday, May 14, 2024
- Advertisement -

240 కోట్ల ఇన్సూరెన్స్ కోసం శ్రీదేవిని చంపేశారా?

- Advertisement -

శ్రీదేవిది సహజ మరణమా? కాదా? శ్రీదేవి మరణం వెనకాల కుట్ర ఉందా అన్న విషయం ఎప్పటి నుంచో చర్చనీయాంశం అవుతూ ఉంది. ఇప్పుడు తాజాగా శ్రీదేవిది హత్య అని చెప్పే మరో సాక్ష్యం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సాక్ష్యాన్ని అడ్డుపెట్టుకునే సునీల్ సింగ్ అనే అడ్వొకేట్ సుప్రీం కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ని కొట్టేసింది. అయితే ఇదే సందర్భంలో ఆ న్యాయవాది చెప్పిన మాటలు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి.

శ్రీదేవి చనిపోతే ………అది కూడా దుబాయిలో చనిపోతే శ్రీదేవి కుటుంబ సభ్యులకు 240 కోట్ల ఇన్సూరెన్స్ వస్తుందని ఆ లాయర్ వాదించాడు. ఇందుకోసమే శ్రీదేవిని చంపేశారని ఎందుకు భావించకూడదని ఆ లాయర్ ప్రశ్నించాడు? తాను దుబాయ్ వెళ్ళానని……శ్రీదేవి చనిపోయిన టబ్…ఇతర పరిసరాలను గమనించానని 5 అడుగుల లోతు ఉన్న టబ్‌లో 5.7 ఇంచెస్ హైట్ ఉన్న శ్రీదేవి ఎలా మునిగి చనిపోతుందని తన వాదనలు వినిపించాడు ఆ లాయర్. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌లో కాన్షస్ కోల్పోయి బాత్ టబ్‌లో మునిగి చనిపోయింది అని ప్రస్తావించారని……అలా జరిగే అవకాశం లేదని వాదించాడు. ఇప్పుడు ఈ టాపిక్స్ మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. మిగతా విషయాలు పక్కన పెట్టినా 240 కోట్ల ఇన్సూరెన్స్…..అది కూడా శ్రీదేవి దుబాయ్‌లో చనిపోతే వస్తుంది అన్న మేటర్ మాత్రం ఆలోచింపచేస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -