కర్నూలు: ఆడపిల్ల కనబడితే వేధించకుండా ఉండరు కొందరు. ముఖ్యంగా చదువుకుంటున్న అమ్మయిలపై కన్నేసి లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఒత్తిడి తట్టుకోలేక పలువురు విద్యార్ధినులు తనువు చాలిస్తున్నారు…
మొన్న నాగార్చున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఉదంతాన్ని చూశాం. ఇప్పుడు ఉషారాణి విషాద కథను వింటున్నాం. వీరిరువురి వెనక ఉన్న కారణాలు ఒకటే వేధింపులు, ర్యాగింగ్ బూతం. విచిత్రమేమంటే పాఠాలు చెప్పి తీర్చి దిద్దాల్సిన లెక్చరర్లే ప్రాణాలు పోవడానికి కారణమౌతున్నారు. రిషితేశ్వరి మరణ సంఘటనలో ప్రిన్స్‌పల్ బాబూరావుపై ప్రధాన ఆరోపణలు రాగా ఉషారాణి విషయంలో ఓ లెక్చరర్‌పై ఆరోపణలు వస్తున్నాయి. నంధ్యాలలోని ఇంజనీరింగ్ కాలేజిలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఉషారాణి. సీనియర్లు ర్యాగింగ్ చేసేవారు, ఏడిపించేవారు.
కాలేజీకి చెందిన సదరు లెక్చరర్ అయితే ఉషారిణి అసభ్య ఫొటోలను ఆమె స్నేహితుల ద్వారా సంపాదించి ఆమెకే పంపి వేధించాడని, ఆమె ఎదురించినప్పటికీ సమస్య తీరలేదని వార్లలొచ్చాయి. ఇంటికి వెళ్లిపోయి తంత్రిని ఆశ్రయించింది, ఎంతో మథనపడింది మళ్లీ కాలేజీకి రాగలిగింది కానీ ప్రాణాలు తీసుకుంది. ఇలా చదువుకుంటున్న ఆడపిల్లలను వేధిస్తున్న పాఠాలు చెప్పే ఈ కీచక ఉపాధ్యాయ పోరంబోకులు మారేదెప్పడంటూ సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకోపక్క చదువుకునే ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని, అన్ని మార్గాలను ఉపయోగించుకుని భరతం పట్టాలే గానీ ప్రాణాలు తీసుకోకూడదని మరికొందరు కోరుతున్నారు.