Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్‌బాస్ విల‌న్ ఎవ‌రు హీరో ఎవ‌రు?

- Advertisement -

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ భారీ అంచనాల మ‌ధ్య మొద‌లైన సంగ‌తి తెలిసిందే.నాని యాంకర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌పై మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తుంది. ఇప్ప‌టికే షోలో పెద్ద‌గా ఆక‌ట్టుకునే సెల‌బ్రిటీలు ఎవ‌రు లేర‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.ఇక షోలోని హోస్‌మెట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి ఒక‌రి మీద ఒక‌రు కంప్లైంట్స్ చేసుకోవ‌డం చూస్తుంటే అస‌లు షో మీద ఎవ‌రికి పెద్ద‌గా ఇంట్రెస్ట్ క‌ల‌గ‌డం లేదు. ఇక హోస్‌మెట్ కౌశిల్‌పై ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం భారీ కుట్ర‌ల‌నే ప‌న్నుతుంది.

నిన్న(గురువారం) జ‌రిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా హోస్‌మెట్స్ రెండు వ‌ర్గాలుగా విడిపోయి గేమ్ ఆడారు. గేమ్‌లో భాగం కౌశిల్ త‌న‌ను బ్రెస్ట్ ట‌చ్ చేశాడని భాను శ్రీ అత‌నిపై ఆరోప‌ణ‌లు చేసింది.ఆమె తోడుగా నేనున్నాను అంటు వ‌చ్చింది తేజ‌స్వీ. కౌశిల్ భాను శ్రీని ట‌చ్ చేయ‌డం నేను చూశాను అంటు ఆమె భాను శ్రీకి మ‌ద్ద‌తు తెలిపింది తేజ‌స్వీ. అయితే త‌ను అక్క‌డ ట‌చ్ చేయ‌లేద‌ని,అంత అవ‌స‌రం త‌న‌కు లేద‌ని ,నేను ఫ్యామిలీ ప‌ర్సన్ అని చెప్పుకొచ్చాడు కౌశిల్‌. వీరంద‌రు క‌లిసి కౌశిల్ క్యారెక్ట్‌ర్ బ్యాడ్ చేయ‌ల‌ని చూస్తున్నార‌ని షో చూసే ప్ర‌తి ఒక్క‌రికి అర్థం అవుతుంది. కౌశిల్ భాను శ్రీని ట‌చ్ చేయ‌లేద‌ని ఆమె తోటి టీంమెట్ గీతా మాధురి చెప్ప‌డంతో వారు ఆడే గేమ్ ఫేక్ అని తెలిసిపోయింది.త‌నీష్,భాను శ్రీ,తేజ‌స్వీ,సామ్రాట్‌,దీప్తి సునైనా వీరంతా కౌశిల్ క్య‌రెక్ట‌ర్ బ్యాడ్‌గా చూపించ‌డానికి తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాని త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నాడు కౌశిల్.

షోలోకి వ‌చ్చినా త‌న ప్ర‌వ‌ర్త‌న మార్చుకోన‌ని తెలిపాడు కౌశిల్‌. షో మొద‌టి వార్ కౌశిల్‌ని చూసిన వారు,ఇత‌ను లేడిస్‌తో త‌న ప్ర‌వ‌ర్త‌న బాలేద‌ని కామెంట్స్ వినిపించాయి.కాని కౌశిల్ త‌రువాత వారంలో త‌న ప్ర‌వ‌ర్త‌న మార్చుకుని మ‌హిళ‌ల‌తో క‌లిసి పోయాడు.దీంతో ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం ప్ర‌తి ఎలిమినేష‌న్‌లో కౌశిల్‌ను ఎలిమినేట్ చేస్తు వ‌స్తున్నారు.నిజానికి హోస్‌లో వాళ్లు కౌశిల్‌ను విలన్‌గా చూస్తున్న బ‌య‌టి వ్య‌క్తుల‌కు మాత్రం అత‌ను హీరోలా క‌నిపిస్తున్నాడు.యాంక‌ర్ నాని కూడా ఇదే విష‌యాన్ని గ‌త‌వారం వెల్ల‌డించాడు కూడా.అయిన అత‌నిపై కుట్ర ప‌న్నుతున్నారు షోలోని తోటి హోస్‌మెట్స్‌.వారికి తెలియ‌దు క‌దా అత‌నికి బ‌య‌ట ఎంత‌టి మ‌ద్ద‌తు ల‌భిస్తుందో.మ‌రి ఇప్ప‌టికైన చేసిన త‌ప్పును వారు గ్ర‌హిస్తారో లేదో చూడాలి.ఇక ఈ వారం ఎలిమినేష‌న్‌లో దీప్తి,గ‌ణేష్,భాను శ్రీ ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -