Tuesday, May 14, 2024
- Advertisement -

కత్తి మహేష్ బాధితురాలిని బెదిరించిన టివి9, మహాటీవీ…. ఎందుకు?

- Advertisement -

సినిమా ఆర్టిస్ట్ శ్రీరెడ్డి విషయంలో మహాటీవీ, టివి9లు చాలా దూకుడుగా స్పందించాయి. ఒక మహిళకు మద్దతుగా నిలుస్తున్నామని గొప్పగా బిల్డప్ ఇచ్చుకున్నాయి. ఇప్పుడు అదే టివి9, మహాటీవీలు సునీత అనే మరో సినిమా ఆర్టిస్ట్ విషయంలో మాత్రం విలన్ పాత్ర పోషిస్తున్నాయి. ఇదే టివి9, మహాటీవీలలో బాధితురాండ్రైన మహిళలకు అనుకూలంగా మహేష్ కత్తి చాలానే మాటలు మాట్లాడాడు. మృగాళ్ళపై తనదైన శైలిలో రెచ్చిపోయాడు.

అయితే ఆ స్థాయిలో రెచ్చిపోతున్న మహేష్ కత్తి కూడా మృగాడేనని సునీత అనే ఒక ఆర్టిస్ట్ మీడియా ముందుకు వచ్చింది. అదే టివి9 ఛానల్‌లో మహేష్ కత్తి సమక్షంలోనే సునీత తన ఆవేదనను వెలిబుచ్చింది. మహేష్ కత్తి తనను ఎలా రేప్ చేశాడో…..ఎంత డబ్బులు చేతిలో పెట్టాడో….ఎలా దగా చేశాడో సవివరంగా చెప్పుకొచ్చింది. ఇంకా కొంతమంది ఆర్టిస్టులు కూడా మహేష్ కత్తిపై ఆరోపణలు చేశారు. అయితే మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్న సురేష్ బాబు లాంటి పెద్ద వాళ్ళు(తమ వర్గం వాళ్ళు) అయిన వాళ్ళను వదిలేసి ఇతరులందరూ దోషులే అనే రేంజ్‌లో రెచ్చిపోయిన టివి9, మహాటీవీలు కత్తి మహేష్ విషయంలో మాత్రం బాధితురాలినే బెదిరిస్తున్నాయి. ఇదే విషయాన్ని బాధితురాలే స్వయంగా మీడియాకు చెప్పుకొచ్చింది. టివి9 మీడియా వారు కత్తి మహేష్ తరపున వకాల్తా పుచ్చుకుని తనను బెదిరిస్తున్నారని వాపోయింది. అలాగే మహా టీవీలో తనను చెడుగా చూపిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నవారు మాత్రం అసలు మహేష్‌కత్తికి టివి9, మహాటీవీలు ఎందుకు మద్దతిస్తున్నాయి? మహేష్‌కత్తి, టీవీ9, మహాటీవీల మధ్య ఉన్న గూడుపుఠానీ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మన మీడియాకు పవన్ కళ్యాణ్‌లాగే ఇతరులను ప్రశ్నించడం, విమర్శించడం బాగా అలవాటు……సరదా కూడా. కానీ వాళ్ళపై వచ్చే విమర్శలు, ప్రశ్నలకు మాత్రం అస్సలు సమాధానం చెప్పరు. లోగుట్టు ఏంటో…ఎప్పటికి బయటపడుతుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -