Sunday, April 28, 2024
- Advertisement -

విజయసాయితో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలను ఏం చేద్దాం?

- Advertisement -

ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగానే అర్థమవుతూ ఉంది. టిడిపి ఎమ్మెల్యేలు కొందరు విజయసాయిరెడ్డికి టచ్‌లో ఉన్నారు. వైకాపాలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నామని విజయసాయికి చెప్తూ ఉన్నారు. ఈ అసంతృప్త ఎమ్మెల్యేలకు భయపడే రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని నిలపలేదు చంద్రబాబు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో వైకపాాలోకి జంప్ అవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు బాబు.

జంప్ అవ్వాలనుకుంటున్న టిడిపి ఎమ్మెల్యేలు, వైకాపా ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ కూడా టిడిపికి వీలైనంత నష్టం చేస్తూ చివరి నిమిషంలో వైకాపాలో చేరిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు పెట్టిన నాలుగేళ్ళ టార్చర్‌కి ఆ రకంగా రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం టిడిపిని వీడాలనుకుంటున్న ఎమ్మెల్యేలకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని పట్టుదలగా ఉన్నాడు. వాళ్ళు పార్టీ మారే నిర్ణయం ప్రకటించకముందే ఆ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆలోచిస్తున్నాడు. ఇదే విషయంపై తాజాగా టిడిపి సీనియర్ నేతలు, భజన మీడియా అధినేతతో రహస్య మీటింగ్ పెట్టుకున్నాడు బాబు. వైకాపాలోకి జంప్ అవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేల సంఖ్య విషయంలో ఒక స్పష్టత అయితే వచ్చిందట. అయితే వాళ్ళను బహిష్కరించే నిర్ణయం మాత్రం పార్టీకి నష్టం చేస్తుందని అనుకున్నారట. అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబుతో ఉండడానికి ఎమ్మెల్యేలు కూడా ఇష్టపడడం లేదని జగన్ పార్టీలో చేరడానికి, జగన్‌ని నమ్మడానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న అంశం ప్రజల్లోకి వెళితే చంద్రబాబు విశ్వసనీయత పూర్తిగా పోతుందని…..అందుకే ఆయా ఎమ్మెల్యేలను బుజ్జగించే కార్యక్రమం మరోసారి చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఏది ఏమైనా జగన్ పాదయాత్ర విశాఖలో అడుగుపెట్టేనాటికి టిడిపి నుంచి వైకాపాలోకి ఎమ్మెల్యేల జంపింగ్స్ కచ్చితంగా ఉంటాయని విశ్లేషకులు ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ సంకట స్థితి నుంచి బాబు ఎలా బయటపడతాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -