ఫించన్ కోసం తన దగ్గరకు వచ్చిన మహిళపై అత్యాచారానికి దిగాడు ఓ ఎమ్మెల్యే. ఈ ఘటన మన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…. ఢిల్లీ అధికార పార్టీ ఆప్ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చెయ్యడం, ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీ రాష్ట్రంలోని రితాలా నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే గోయల్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, 509 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన కార్యలయంలోనే సదరు ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపణలు చేస్తుంది. అయితే గతంలో ఇదే మహిళ ఈ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఏకంగా అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ఆప్ పార్టీ మాత్రం కావలనే మా ఎమ్మెల్యేపై కావలనే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తోంది.ఏది ఏమైనప్పటికి అత్యాచారం కేసులో ఎమ్మెల్యేపై కేసు నమోదు చెయ్యడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
- Advertisement -
ఫించన్ కోసం వచ్చిన మహిళపై అత్యాచారం ఎమ్మెల్యే
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -