Friday, May 17, 2024
- Advertisement -

యూట్యాబ్ వీడియో ఓ నిండు ప్రాణాన్ని బ‌ల‌తీసుకుంది..

- Advertisement -

యూట్యూబ్ వీడియో ఓ నిండు ప్రాణాన్ని బ‌లితీసుకుంది. యూట్యూబ్ వీడియో చూస్తూ ఇంట్లోనే ప్రసవిద్దామనుకున్న ఓ గర్భిణి నిర్ణయం ఆమెను మృత్యు ఒడిలోకి తీసుకెళ్లింది. బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చినా …త‌ర్వాత అధిక ర‌క్త‌స్రావం కావ‌డంతో ఆమె మ‌ర‌ణించింది. తమిళనాడులోని తిర్పూర్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పుదుపాలయంకు చెందిన కార్తికేయన్‌ భార్య కీర్తిక అదే ప్రాంతంలోని ఓ ప్రవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. కార్తికేయన్ ఓ దుస్తుల కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరికి హిమాని అనే కూతురు ఉంది. వీరి పక్కనే నివసిస్తున్న లావణ్య, ప్రవీణ్‌ల జంటతో వీరు స్నేహంగా ఉండేవారు.

తొలిసారి గర్భం దాల్చినప్పుడు కృతిక ఆస్పత్రిలోనే డెలివరీ అయింది. అయితే ప్రకృతి వైద్యంపై నమ్మకమున్న ఈ దంపతులు రెండో కాన్పును సహజ పద్ధతుల్లో ఇంటి వద్దే చేసుకుందామనుకున్నారు. అందుకోసం కృతిక పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. కృతిక సహోద్యోగి భార్య లావణ్య ఇటీవలే ఇంట్లోనే సహజ పద్ధతిలో పండంటి బిడ్డకు జన్మనివ్వడం, తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉండటంతో ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపైంది.

భర్త కార్తికేయన్ ను ఒప్పించి ఇంట్లోనే ప్ర‌స‌వానికి సిద్ధ‌మ‌య్యింది. స‌హ‌జంగా డెలెవ‌రీ అయ్యేందుకు కీర్తి యూట్యూబ్‌లో ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూశారు. ఆదివారం కీర్తికకు పురిటి నొప్పులు రావడంతో.. లావణ్యకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకుని యూట్యూబ్‌ వీడియోల్లో మాదిరి సహజ ప్రసవానికి ప్రయత్నించారు. కాన్పు సమయంలో బిడ్డ తిరగబడటంతో పరిస్థితి తలకిందులైంది. బిడ్డకు జన్మనిచ్చిన మరుక్షణమే కృతిక మృత్యువాతపడింది.

కీర్తి మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లగా.. డెత్ సర్టిఫికెట్‌ లేకపోవడంతో అక్కడి సిబ్బంది దహనానికి అంగీకరించలేదు. శశ్మాన సిబ్బంది సమాచారంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. పంచనామా అనంతరం కీర్తిక మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీర్తిక భర్తతో పాటు లావణ్య దంపతులను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -