ఈ నెల 23న అసోంలోని తేజ్ పూర్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన వైమానికి దళ యుధ్ద విమానం సుఖోయ్-30 గల్లంతయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత దాని అచూకి లభ్యమయినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ విమానం శకలాలు అరుణాచల్ ప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నామని, మరింత సమాచారం కోసం బ్లాక్ బాక్స్ ను గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. విమానంలోని వారు మరణించి వుండవచ్చని, ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి వుందని తెలిపారు.
{loadmodule mod_custom,Side Ad 1}
భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం చైనా సరిహద్దులో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. గస్తీ నిర్వహించే ఈ విమానం అసోంలోని తేజ్‌పూర్‌కు సమీపంలో మంగళవారం ఉదయం మిస్సయింది.అందులో ఇద్దరు పైలట్‌లు ఉన్నట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో సుఖోయ్ టేకాఫ్ తీసుకుని చైనా సరిహద్దుకు సమీపంలోని దౌలాసాంగ్ సమీపంలో కనిపించకుండా పోయింది. చివరిసారిగా 11.30గంటల ప్రాంతంలో అస్సోంలోని తేజ్‌పూర్‌కు 60 కిలో మీటర్ల దూరంలో దీని జాడలు రికార్డయ్యాయి.
ఈ విమానం శకలాలు అరుణాచల్ ప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నామని, మరింత సమాచారం కోసం బ్లాక్ బాక్స్ ను గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. విమానంలోని వారు మరణించి వుండవచ్చని, ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి వుందని తెలిపారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read