- Advertisement -

క‌య్యానికి కాలు దువ్వుతున్న భార‌త్‌….పాక్‌

- Advertisement -
India, Pakistan maintain high operational military readiness along LoC

భార‌త్‌-పాక్ మ‌ధ్య ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. స‌రిహ‌ద్దుల్లో యుద్ధ‌వాతా వ‌ర‌ణం నెల‌కొంది.ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు భార‌త్ స‌న్న‌ద్ధ‌మ‌వుతుంటే….పాక్ కూడా క‌య్యానికి కాలు దువ్వుతోంది.

ఒకవైపు తన ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌లను అప్రమత్తం చేసి, వార్ ఎక్సర్‌సైజులు నిర్వహించిన పాకిస్థాన్.. మరోవైపు రెచ్చగొట్టుడు వ్యాఖ్యలకు దిగింది.
కొద్ది రోజుల కింద‌ట‌ నాయిబ్‌ సుబేదార్‌ పరంజిత సింగ్‌, బీఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌సాగర్‌ల శిరచ్ఛే దంపై భారత రగిలిపోతోంది. అప్పటి నుంచే ఎల్‌వోసీ వెంట ఉద్రిక్తత అలుముకుంటోంది. ఈ క్రమంలో… ఈనెల 9న నౌషెరా సెక్టార్‌లో పాక్‌ సైనిక బంకర్లను ధ్వంసం చేసిన దృశ్యాలను భారత మంగళవారం విడుదల చేసింది. ఇది చూసి త‌ట్టుకోలేని పాక్ అవాకులు చ‌వాకులు పేలుతోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

పాక్ బంక‌ర్ల ధ్వంసానికి సంబందించిన వీడియేను చూసి బెంబేలెత్తిపోయిన పాక్ యుద్ధ సన్నద్ధతలో భాగంగానే అత్యంత ఎత్తైన యుధ్ద ప్రాంతంలోసియాచిన్‌ ప్రాంతంలో పాక్‌కు చెందిన ‘మిరాజ్‌’ విమానాలు యుద్ధ విన్యాసాలు చేశాయి. పాక్ వైమానికి ద‌ళ ఛీఫ్ సోహైల్ వైమానిక దళ అధికారులతో కలిసి బుధవారం ఉదయం స్కర్డు ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన సొహైల్.. వైమానిక దళ సన్నద్ధతను ప్రత్యక్షంగా పరిశీలించారు. మిరేజ్ జెట్‌లోనూ ప్రయాణించారని వార్తలు వచ్చాయి. స్కర్డు ఎయిర్‌బేస్‌లో పైలట్లు, సాంకేతిక సిబ్బందితో ముచ్చటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ శత్రువు చేసే ప్రకటనలు పట్టించుకోబోమని చెప్పారు. శత్రువు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తగిన సమాధానం చెప్తామన్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

అయితే భారత గగన తలం ఉల్లంఘనకు గురికాలేదని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్పష్టంచేసింది. పాక్ యుద్ధ విమానాలు సియాచిన్ గ్లేసియర్‌పైకి రాలేదని తెలిపింది. సియాచిన్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న యుద్ధ క్షేత్రం. నౌషెరా సెక్టార్‌లో తామే భారత పోస్టులను ధ్వంసం చేశామంటూ కొత్తగా 87 సెకన్ల నిడివిగల వీడియోను పాక్ విడుద‌ల చేసింది.అయితే భార‌త్ దాన్ని ఖండించింది.అయితే పాక్‌ విడుదల చేసిన వీడియో నకిలీదని భారత సైన్యం ప్రకటించింది. ఆ వీడియోను ఎడిట్‌ చేసిన చిహ్నాలు కూడా కనిపిస్తున్నాయని తెలిపింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -