Monday, May 20, 2024
- Advertisement -

స‌రిహ‌ద్దుల్లో పాక్ శిభిరాల‌ను పూర్తిగా ధ్వంసం చేసిన సైనిక ద‌ళాలు

- Advertisement -
Strikes Pakistani posts along LoC.. . Indian Army sends strong message to Islamabad

కుక్క బుద్ధి ప్ర‌ద‌ర్శించే పాకిస్థాన్‌కు తిరిగిపోయే షాక్ ఇచ్చింది భారత సైన్యం. ఓపికతో.. సహనంతో.. శాంతితో ఉన్నప్పటికీ.. నిత్యం ఏదో రకంగా కెలికే పాకిస్థాన్కు మరోసారి దిమ్మ తిరిగిపోయేలా బలమైన సమాధానం ఇచ్చాయి భారత్ సైనిక దళాలు.

సరిహద్దుల్లో పాగా వేసి.. చొరబాట్లకు సాయంగా నిలుస్తున్న పాక్ శిబిరాల్ని భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ దాడులతో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్థానీ శిబిరాలు పూర్తిగా నాశనమైనట్లుగా తెలుస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఈనెల 21,22 తేదీల్లో పాక్ బంక్ల‌ను ద్వంసం చేసిన సంగ‌తిని అధికారికంగా ప్ర‌క‌టించారు.దానికి సంబంధించిన వీడియేల‌ను కూడా ఇండియ‌న్ ఆర్మీ విడుద‌ల చేసింది.ఉగ్ర‌వాదుల‌ను నియంత్రన రేఖ దాటేందుకు పాక్ ఏర్పాటు చేసిన శిబిరాలు పూర్తిగా ధ్వంస మ‌య్యాయి.దీంతో పాకిస్థాన్‌కు భార‌త ద‌ళాలు గ‌ట్టిగా స‌మాధాన మిచ్చాయి.నియంత్ర‌న రేఖ వెంబ‌డి ఉన్న ప్రాంతాలు ఆర్మీ నియంత్ర‌ణ‌లోనే ఉన్న‌య‌ని అధికారులు వెల్ల‌డించారు.
ఆర్మీ పాక్ శిక్ష‌ణా శిబిరాల‌కు సంబంధించిన వీడియేల‌ను విడుద‌ల చేసింది. దొంగ చాటుగా దెబ్బ‌తీసె పాక్‌కు భార‌త్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది.చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్నా ప‌లితం ఉండ‌ద‌ని… ఒక అడుగు ముందుకేసి పాక్ శిక్ష‌ణా శిబిరాల‌ను పూర్తిగా ధ్వంసం చేసింది.భారత్ లోకి చొరబాట్లను ప్రేరేపించేందుకు వీలుగా పాక్ పావులు కదిపిన సమాచారం పూర్తిగా తెలుసుకొన్నాక.. పరిశీలన జరిపి మరీ దాడులు నిర్వహించినట్లుగా ఆర్మీ వెల్లడించటం విశేషం. పాక్ పై తాజా దాడులు ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

{loadmodule mod_custom,Side Ad 2}

అయితే పాకిస్తాన్ మాత్రుం అలాంటి దాడులు జ‌ర‌గ‌లేద‌ని ఎప్ప‌టిలాగే బుకాయించే ప్ర‌య‌త్నం చేసింది.కిస్థాన్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆసిఫ్ ఘ‌ఫూర్.. ఈ అంశంపై స్పందిస్తూ.. ఎల్‌వోసీ వెంట ఉన్న నౌషెరాలోని త‌మ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త్ చేస్తోన్న వ్యాఖ్య‌లు అంతా అస‌త్య‌మేన‌ని అన్నారు. గతంలో భారత్ పీవోకేలో సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సందర్భంలోనూ పాక్ ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -