Monday, May 20, 2024
- Advertisement -

ఎమ్మెల్యేల వివ‌రాలు ఇవ్వ‌ని జాబితాలో చంద్ర‌బాబు ఉన్నారా…?

- Advertisement -

దేశంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం రూ.4.59 లక్షలు కాగా, వ్యక్తిగత ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజాప్రతినిధులే అత్యంత ధనవంతులని ఓ సర్వేలో తేలింది. ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడ్‌విట్ల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంస్థ విశ్లేషించి ఓ నివేదిక వెల్లడించింది.

దేశంలోని మొత్తం సిట్టింగు ఎమ్మెల్యేల సంఖ్య 4,086 మందిలో 3,145 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల ఆదాయ వివరాలను అఫిడ్‌విట్ ఆధారంగా క్రోడీకరించింది.మొత్తం 941 మంది తమ, తమ కుటుంబ సంపాదన వివరాలను ప్రకటించలేదు అని ఈ సంస్థ పేర్కొంది.

ఇక దక్షిణాదికి చెందిన 711 మంది సభ్యుల సగటు వార్షికాదాయం రూ.51.99 లక్షలు. కడప జిల్లా పులివెందుల నుండి జగన్ వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ.13.92 కోట్లు ఉందని ఏడీఆర్ తెలిపింది. జగన్ తో పాటు ఆయన సతీమణి, ఇతర కుటుంబసభ్యుల ఆదాయంతో కలుపుకొని రూ. 18.13 కోట్లుగా ప్రకటించింది.ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ దేశంలోనే టాప్ ఫైవ్‌లో లో నిలిచారు.

అలాగే తెలంగాణ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ ఆరో స్థానంలో ఉన్నట్టుగా ఏపీకి సంబంధించిన వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పదో స్థానంలో, నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి 14వ స్థానంలో ఉన్నట్టుగా, తెలంగాణకు సంబంధించి పైళ్ల శైఖర్ రెడ్డి 19వ స్థానంలో ఉన్నట్టుగా పేర్కొంది.

అత్యల్ప ఆదాయలను చూపిన వారిలో నంబర్ వన్ పొజిషన్లో ఉంది శింగనమల ఎమ్మెల్యే యామినీబాల. ఈ జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 16వ స్థానంలో ఉన్నారు. ఇక ఈ జాబితాలో చంద్రబాబు పేరు ఎక్కడా కనిపించలేదు.

తన భార్య బ్రహ్మణి, తన తల్లి నారా భువనేశ్వరిలు భారీగా సంపాదిస్తున్నారని, ప్రతియేటా వారి వార్షిక వేతనాలే కోట్ల రూపాయల్లో ఉన్నాయని స్వయంగా నారా లోకేష్ ప్రకటించాడు.కుటుంబ సభ్యుల ఆదాయాలను కలిపి చూస్తే చంద్రబాబు నాయుడుకు ఏ స్థానం దక్కుతుందో చెప్పనక్కర్లేదు.

ఇప్పటి వరకూ ఈ జాబితాలో చంద్రబాబు స్థానం ఏది? అనే అంశం గురించి ఏడీఆర్ స్పష్టత ఇవ్వలేదు. వివరాలు ఇవ్వని 941 మంది ఎమ్మెల్యేల జాబితాలో చంద్రబాబు కూడా ఉన్నారా అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఇక ఈ జాబితాలో ఇప్పటివరకూ కొన్ని వివరాలనే ప్రకటించింది ఆ సంస్థ. రాష్ట్రాల వారీగా జాబితాను పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. రాష్ట్రాల వారీగా వివరాలను ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితాను, వారి వారి సంపాదనలను ఏడీఆర్ జాబితాలను ఇస్తే కానీ ఈ వ్యవహారంపై స్పష్టతరాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -