Monday, May 13, 2024
- Advertisement -

సోషల్ మీడియాలో జగన్ ఫోటోలకు ఫుల్ క్రేజ్!

- Advertisement -

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెరుసలేం పర్యటన ఆధ్యంతం పెద్దగా హడావుడి, వార్తలు లేకుండానే జరిగిపోయింది. జగన్ అక్కడకు వెళ్లాడని కూడా చాలా మంది తెలియదు. అయితే ఒక్కసారి గా జగన్ అభిమాని ఒకరు జెరుసలేంలో ఆయనతో దిగిన సెల్ఫీలతో ఈ విషయానికి ప్రచారం వచ్చింది.

ప్రత్యేకించి జగన్ లుక్ కు ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సాధారణంగా ఏపీలో ఉన్నప్పుడు ఒకే రకమైన గెటప్ లో కనిపించే జగన్ జెరుసలేం లో మాత్రం బిన్నమైన లుక్ లో కనిపించారు.

లవ్ నెక్ టీ షర్ట్ తో.. మెడలో బంగారు గొలుసుతో.. బ్లాక్ బ్లేజర్ తో జగన్ కనిపించాడు. మొహంలో ప్రయాణ బడలిక కనిపిస్తున్నా.. జగన్ మోహన్ రెడ్డి గ్లామర్ కుమాత్రం లోటు లేకపోయింది. సినిమా హీరోలకు ధీటైన ఫిజిక్ తో లుక్ తో కనిపించాడు జగన్ రెడ్డి. ఆయన ఫోటోలు మాత్రం అభిమానులను అమితంగా ఆనంద పెట్టాయి. జగన్ ఫోటోలను ఫేస్ బుక్ లో తమ వాల్ పైకి షేర్ చేసుకొని ఆనందించారు ఫ్యాన్స్. రెండు రోజులుగా ఏపీ లెవల్ ఎఫ్ బీ అకౌంట్లలో ఇదే ట్రెండ్ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -