Sunday, May 4, 2025
- Advertisement -

చంద్రబాబుపై ఫిర్యాదు

- Advertisement -

గవర్నర్ నరసింహన్ ను వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కలిసారు. శనివారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ అనైతికత పాటిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఎపిలో అధికార పార్టీ విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి వారిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు. సిఎం చంద్రబాబు నాయుడు తీరుపై సేవ్ డెమక్రసీ పేరుతో నేటి నుంచి ఆందోళన కార్యక్రమాలకు వైఎస్ఆర్ సిపి శ్రీకారం చుట్టింది.

ఈ రోజు సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. గవర్నర్ ను కలిసి వారిలో వైఎస్ జగన్ తో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -