Monday, April 29, 2024
- Advertisement -

రాష్ట్రాన్ని పాలించేది గవర్నర్లా .. ముఖ్యమంత్రులా ? అసలేంది ఈ రచ్చ ?

- Advertisement -

ప్రస్తుతం సౌత్ రాష్ట్రాలలో గవర్నర్ వర్సస్ ముఖ్యమంత్రుల రగడ కొనసాగుతోంది. కేరళ, తమిళనాడు, తెలంగాణ ఇలా ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మరియు గవర్నర్ల మద్య జరుగుతున్న రగడ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కాగా అసలు గవర్నర్ ముఖ్యముఖ్యమంత్రుల మద్య వివాదాలు ఎందుకొస్తున్నాయి ? ఇంతకీ రాష్ట్రాన్ని పాలించేది గవర్నరా లేదా ముఖ్యమంత్రా ? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని పరిపాలించే సర్వహక్కులు ముఖ్యమంత్రే కలిగి ఉంటాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి గనుక రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రిదే కీలక పాత్ర. .

కానీ ప్రస్తుతం ఆయా రాష్ట్రాలలో గవర్నర్ల చొరవ ఎక్కువగా ఉందని, ఇది అప్రజాస్వామికం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ కు మద్య నెలకొన్న వివాదం డిల్లీ వరకు చేరింది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పని చేయకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని స్టాలిన్ సర్కార్ గట్టిగానే ఆరోపణలు చేస్తోంది. ఏకంగా గవర్నర్ ను తొలగించాలని స్టాలిన్ సర్కార్ రాష్ట్రపతి కి లేఖ రాసిందంటే.. తమిళనాడులో గవర్నర్ వర్సస్ స్టాలిన్ సర్కార్ వివాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కేరళలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ మరియు కేరళ సి‌ఎం పినరాయి విజయన్ మద్య వివాదం కొనసాగుతోంది.

అలాగే తెలంగాణ విషయానికొస్తే గవర్నర్ తమిళ్ సై మరియు కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి మద్య వివాదం ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా గవర్నర్ మరియు ముఖ్యమంత్రుల మద్య వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే అన్నీ రాష్ట్రాలలోనూ ఇలా గవర్నర్ వర్సస్ ముఖ్యమంత్రుల మద్య వివాదాలు కొనసాగుతున్నాయా ? అంటే లేదనే చెప్పాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ వివాదానికి తావే లేదని, కేవలం బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలోని ఇలా వివాదాలు తెరపైకి వస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గవర్నర్ సలహాలు ఇవ్వడంలో తప్పులేదని, అలా కాకుండా ప్రభుత్వంపై అధికారం చెలాయించడం గవర్నర్ విధి కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మోడీ చుట్టూ రాజకీయ రగడ !

ఏపీలో ఉపఎన్నిక..రాబోతుందా ?

బీజేపీ పై సెటైర్లు : డబుల్ ఇంజన్ సర్కార్ లో.. ఇంజన్ ఉందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -