Monday, May 5, 2025
- Advertisement -

ఈనెల 28 తేల‌నున్న జ‌గ‌న్ భ‌విష్య‌త్తు….

- Advertisement -
Ysrcp Chief Jagan’s Bail Be Decided On April 28th

జ‌గ‌న్ బేయిల్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గామారింది. ఆయ‌న రాజ‌కీయంపైకూడా తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. చంద్ర‌బాబు ముంద‌స్తు ఎన్నిక‌ల‌న‌డంతో ఇప్పుడు జ‌గ‌న్ బేయిల్ వ్య‌వ‌హారం ఆపార్టీ శ్రేణుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. పైకి గంభీరంగా  పార్టీ నాయ‌కులు మాట్లాడుతున్నా లోలోప‌ల మాత్రం భ‌య‌ప‌డుతున్నారు.

ఒక వేల జ‌గ‌న్‌కు జైలుకు వెల్తే ప‌రిస్థితి ఏంట‌నీ ఆందోళ‌న‌లో ఉన్నారు. అక్రమాస్తులు, అక్రమ పెట్టుబడుల కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న  వైఎస్‌ జగన్‌కు జైలా…బేయిలా  అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చాలాకాలంగా బెయిల్‌పై ఉంటున్న జగన్‌ బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘించారని, కాబట్టి ఆయన బెయిల్‌ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపాలని సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

జ‌గ‌న్ బేయిల్ వ్య‌వ‌హారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ‌ను రేపుతోంది. జగన్‌ జైలుకు వెల్తార‌ని  టీడీపీ నాయకులు ధీమాతో ఉండ‌గా… ఆయన జైలుకు వెళ్లరని వైకాపా నాయకులు కూడా అదే ధీమాగా ఉన్నారు. ఈ కేసు నిలిచేదికాదని జగన్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. జ‌గ‌న్‌కు బేయిల్ ర‌ద్దుఅయితే పార్టీపైనా తీవ్ర‌ప్ర‌భావం ప‌డ‌నుంది. ఇప్పుడిప్పుడే  టీడీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లల్లో వ‌స్తున్న వ్య‌తిరేక‌త…. దాంతోపాటు వైసీపీకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పెరుగుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌లుకూడా ఇప్పుడు ఆపార్టీ నాయ‌కుల‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

జ‌గ‌న్ బేయిల్ ఇష్యూకు కార‌నం కొం తకాలం క్రితం ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డిని సాక్షి టెలివిజన్‌ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఆ ఇంటర్వ్యూలో జగన్‌ గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. జగన్‌ ఏనాడూ సచివాలయానికి వచ్చి తనను కలుసుకోలేదని, ఫలానావారికి ఫేవర్‌ చేయాలని కోరలేదని, పనులు చేసిపెట్టమని అడగలేదని చెప్పారు. జగన్‌పై కేసు నిలిచేది కాదని తాను ఆనాడే చెప్పానని కూడా అన్నారు. ఇదంతా సీబీఐకి మహా ద్రోహంలా కనిపించింది. బెయిల్‌పై ఉన్న జగన్‌ సాక్షులను ప్రభావితం చేసేవిధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బెయిల్‌ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్‌ వేశారు.

జగన్‌కు రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో ఎలాంటి సంబంధం లేదని వైకాపా నాయకులు ఒక వైపు చెబుతున్నా…. ఈ కేసులో జగన్‌ సిబీఐ పిటిషన్‌ను కొట్టివేయాల‌ని…. తాను కుటుంబ సభ్యులతో న్యూజిలాండ్‌ వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. ఇప్పుడీ కేసులో తీర్పు ఏమొస్తుందోనని ఉత్కంఠభరితంగా ఉంది. సీబీఐ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తే దర్యాప్తు సంస్థ హైకోర్టుకు వెళుతుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఒకవేళ జగన్‌ జైలుకు వెళితే టీడీపీ నాయకులు ఊపిరి పీల్చుకుంటారు. జగన్‌ జైలుకు వెళ్లాల్సివస్తే వైకాపా పరిస్థితి ఏమిటనేది అభిమానులను వేధిస్తున్న ప్ర‌శ్న‌.

జగన్‌ జైలుకు వెళ్లడం జరిగితే ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారతాయి. దీన్ని ప్రతీకార రాజకీయాలుగా వైకాపా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే వైకాపా మీద ఎన్నో ప్రతీకార చర్యలు సాగుతున్నాయి. వైకాపా సానుభూతి పరుడు అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న రవి కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం ఇందుకు నిదర్శనం. ఈ ఘటనతో సోషల్‌ మీడియా ప్రాధాన్యం, పాత్ర, నియంత్రణ తదితర విషయాలపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఏర్పేడు బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్‌..
  2. నెటి జ‌న్ల‌కు జ‌గ‌న్ పిలుపు….. నేను అండ‌గా ఉంటా..
  3. రైతు దీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్న జ‌గ‌న్‌
  4. టీడీపీ, జ‌న‌సేన కాకుండా జ‌గ‌న్‌కు మరో తలనొప్పి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -