Monday, May 20, 2024
- Advertisement -

టీడీపీ, జ‌న‌సేన కాకుండా జ‌గ‌న్‌కు మరో తలనొప్పి

- Advertisement -
One More New Tension To Jagan About MIM

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్.. 2019 ఎన్నిక‌ల్లో గెలిచి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడిపోతే.. రాజ‌కీయ భ‌విష్య‌త్తు పూర్తిగా అంధ‌కారం అవుతుండని చాలా మంది అంటున్నారు. అయితే జ‌గ‌న్ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి చాలా ప్లాన్లు వేస్తున్నాడు.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు అధికార టీడీపీతో పాటు కొత్త పార్టీ జ‌న‌సేన గ‌ట్టి పోటీ ఇస్తాయ‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ రెండు పార్టీల‌కు జ‌గ‌న్ గట్టి పోటీ ఇచ్చి గెలావాలి. ఇక కాంగ్రెస్ ఎలాగూ ఏపీలో దీనావ‌స్థ‌లో ఉంది. ఆ పార్టీ నుంచి పోటీ ఉంటుంద‌ని ఆశించ‌లేం. అయితే ఇప్పుడు మ‌రో కొత్త పార్టీ నుంచి జ‌గ‌న్‌కు కొత్త త‌ల‌నొప్పులు స్టార్ట్ అవుతాయా ? అంటే అవున‌నే సమాదానం వస్తోంది. హైదరాబాద్ కి మాత్రమే పరిమితమైన ఎంఐఎం కొన్నేళ్లుగా దేశమంతటా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.

ఉత్తరాది రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా ఉనికి చాటుకుంటోంది. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో జౌరంగాబాద్‌లో రెండు చోట్ల గెలిచి మ‌రో రెండు చోట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఈ నెపథ్యంలో ఎంఐఎం అడుగులు ఏపీ వైపు కూడా పడుతున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో ఎంఐఎం పోటీ చేయాల‌ని ప్లాన్లు వేస్తోంది.  ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల్లో ఈ పార్టీ టిక్కెట్లు ఇచ్చిన ముస్లిం అభ్య‌ర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇప్పుడు ఎంఐఎం ఇక్క‌డ పోటీ చేస్తే ఆ వర్గం ఓట్ల‌న్నీ వాళ్ల‌కు ప‌డ‌డం ఖాయం. అదే జ‌రిగితే వైసీపీకి పెద్ద దెబ్బే ప‌డుతుంది. దీంతో ఏపీలో పోటీ చేయాల‌న్న ఎంఐఎం నిర్ణ‌యం జ‌గ‌న్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంద‌ట‌. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -