- Advertisement -

వైసీపీ టార్గెట్ లిస్ట్ లో పవన్

- Advertisement -

వరుసగా ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారాలతో.. డీలా పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తన ప్రత్యర్థి బలాలపై కాన్సన్ ట్రేట్ చేస్తోంది. జనసేన పార్టీతో రాజకీయాల్లోకి వచ్చి.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు ప్రధాన కారణాల్లో ఒకడిగా ఉన్న పవన్ కళ్యాణ్ పై.. వైసీపీ ప్రధానంగా దృష్టి పెడుతోంది.

ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నది పవన్ కళ్యాణ్ స్టేట్ మెంట్లలో ఒకటి. ఇప్పుడు అదే స్టేట్ మెంట్ ను పవన్ కు కౌంటర్ గా వదులుతోంది వైసీపీ. బాబు ప్రభుత్వం చేస్తున్న తప్పులపై రియాక్ట్ అవ్వాలంటూ.. పవన్ ను వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా.. ఈ విషయంలో ఓ అడుగు ముందుంటున్నారు.

ప్రజా బలంతో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలను.. టీడీపీలో చేర్చుకోవడంపై పవన్ స్పందించాలని వైసీపీ నేతలు రోజుకొకరుగా డిమాండ్ చేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. చాలా కాలంగా రాజకీయాలపై సైలెంట్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్.. తాజా పాలిటిక్స్ పై అసలు తన ఉద్దేశమేంటో స్పష్టం చేయాలని అడుగుతున్నారు. మరి.. వైసీపీ డిమాండ్లకు పవన్ స్పందిస్తాడా? లేదంటే తనకు అలవాటైన సైలెన్స్ ను మెయింటైన్ చేస్తాడా? చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -