Sunday, May 19, 2024
- Advertisement -

రాజీవ్ హంతకుల విడుదల?

- Advertisement -

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో.. 24 ఏళ్లుగా జీవిత శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ విషయంలో మీ వైఖరేంటో చెప్పండంటూ… కేంద్రానికి జయ సర్కార్ లేఖ రాసింది. జాతీయ రాజకీయాల్లో ఈ లేఖ.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై.. కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది దేశ సమగ్రతకు చేటు చేస్తుందని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే కామెంట్ చేశారు. ఇలాంటి హంతకులను ఇవాళ తమిళనాడులో విడుదల చేయమంటారు.. రేపు మరో రాష్ట్రంలో విడుదల చేయమంటారు.. ఇది సరైన విధానం కాదంటూ తీవ్రంగా స్పందించారు. కేంద్రం ఈ విషయంలో స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు.

అటు తమిళనాడు ప్రభుత్వ సిఫారసు లేఖ.. ఇటు కాంగ్రెస్ నేతల నుంచి మొదలైన విమర్శల మధ్య.. ఏ నిర్ణయం తీసుకోవాలన్న విషయంలో కేంద్రం మాత్రం ఓ క్లారిటీకి రాలేకపోతోంది. ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా.. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కచ్చితంగా బీజేపీపై ప్రభావం చూపిస్తుందని లెక్కలేస్తున్న కేంద్రం.. ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించింది.

చూస్తుంటే.. రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓ వివాదంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -