Monday, May 20, 2024
- Advertisement -

2019 ఎన్నికల సర్వేః బాబు అట్టర్ ఫ్లాప్, కెసీఆర్‌కీ కష్టాలే… ఎపిలో థంపింగ్ మెజార్టీతో జగన్

- Advertisement -

చంద్రబాబుకు టైం అస్సలు కలిసి రావడం లేదు. 2014లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడు. విభజన పాపంలో సమాన భాగం ఉన్న బిజెపిని, మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిని రుద్దాడు. మోడీ చిప్ప చూపించిన పాపం కూడా బాబుకే తగిలింది. మొత్తానికి 2014లో అన్ని అడ్డదారులూ తొక్కి, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు……ప్రజల్లో తనపైన ఉన్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నట్టే ఉన్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నో సర్వేలు తేల్చిచెప్పగా ఇప్పుడు మరోసర్వే కూడా అదే విషయాన్ని నిరూపించింది.

2019 ఎన్నికల్లో టిడిపికి 60 సీట్ల లోపే వస్తాయి. అది కూడా పవన్ కళ్యాణ్ జనసేన, కమ్యూనిస్టులు సీట్లు గెలుచుకోవడంలో ఎంతగానో విఫలమయితే టిడిపికి మేక్సిమం 60 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదే టైంలో 100 సీట్లకు పైగా భారీ మెజార్టీతో జగన్ అధికారంలోకి రావడం ఖాయం అని ఈ సర్వే చెప్పింది. ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇదే పరిస్థితి అన్నది సర్వే రిపోర్ట్. చంద్రబాబు, జగన్‌ల ఎన్నికల హామీలను ప్రజలు ఎంత ఎక్కువగా నమ్ముతున్నారు అని కూడా చేసిన సర్వేలో చంద్రబాబుని నమ్మేవాళ్ళ శాతం 20 శాతం కంటే లోపే ఉంది. అదే వైఎస్ జగన్ విషయంలో మాత్రం 60శాతం పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తామని చెప్తున్నారు. ఆ రకంగా చూస్తే ఎన్నికల హామీలతో ఏవైనా స్టంట్స్ చేసి, అబద్ధపు ప్రచారంతో గెలిచే అవకాశం కూడా చంద్రబాబుకు తక్కువే.

ఇక తెలంగాణాలో కూడా కెసీఆర్‌కి ఏకపక్షంగా ఉండదని ఈ సర్వే చెప్తోంది. కెసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా అది ఎంఐఎంలాంటి పార్టీతో పొత్తుపెట్టుకునేనట. కాంగ్రెస్‌కి కూడా 45సీట్ల వరకూ వస్తాయని ఈ సర్వే చెప్తోంది. ఏది ఏమైనా తెలంగాణాలో కెసీఆర్‌కి తన అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అవడం ఖాయమని జాతీయ స్థాయి సీనియర్ జర్నలిస్టులు చేసిన ఈ సర్వే ఫలితాలు తెలియచేస్తున్నాయి. మోడీతో విడిపోయినప్పటికీ చంద్రబాబును మాత్రం కేంద్రం నుంచి హామీలు రాబట్టలేకపోయిన నాయకుడిగానూ, ముఖ్యమంత్రిగా తాను ఇచ్చిన హామీలు నెరవేర్చుకుండా ప్రజలను మోసం చేసిన నాయకుడిగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారని ఈ సర్వే తేల్చి చెప్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -