Friday, April 26, 2024
- Advertisement -

ఈ త‌న్నుడేంది బాల‌య్య‌….!

- Advertisement -

హిందూపురం ఎమ్మెల్యే, సినీన‌టుడు బాల‌కృష్ణ దురుషుత‌నం మ‌రో సారి బ‌య‌ట ప‌డింది. ఆవేశం వ‌చ్చింటె పార్టీ కార్య‌క‌ర్త‌లైనా, అభిమానుల మీదైనా స‌రే చేయి చేసుకోవ‌డం , తిట్ల‌దండ‌కం మొద‌లు పెట్ట‌డం అల‌వాటె. గతంలో పలుమార్లు తన అభిమానులపై చేతి వాటం చూపించిన బాలయ్య, ఇటీవల ఒక జర్నలిస్ట్ నోరు పారేసుకుని, చివరకు క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా హిందూపురంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాల‌య్య మ‌రో సారి రెచ్చిపోయారు. ఈసారి నోటికి కాకుండా త‌న చేతికి ప‌ని చెప్పారు.

సొంత టీడీపీ కార్య‌క‌ర్త‌పైనె చేయి చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.దుసుగా ప్ర‌వ‌ర్తించి నానా హంగామా సృష్టించాడు.సిరివరం చెరువుకు నీరు విడుదల చేయాలని కోరిన టీడీపీ కార్యకర్త రవికుమార్ పై చేయి చేసుకున్నాడు బాలకృష్ణ . ఆగ్రహించిన బాల‌కృష్ణ‌ రవికుమార్‌ను బయటకు పంపాలని పోలీసులను ఆదేశించాడు.

బాలకృష్ణ ఆదేశాలతో రవికుమార్‌ను పోలీసులు బయటకి నెట్టేశారు. బాల‌య్య చేయి చేసుకోవ‌డంతో మ‌న‌స్థాపం చెందిన ర‌వికుమార్ పార్టీస‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. బాల‌య్య‌కు ఇలాంటివి కొత్త కాక‌పోయినా ఎన్నిక‌ల స‌మ‌యంలో అదీ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల బాల‌య్య విజ‌యంపై ఎంతో కొంత ప్ర‌భావం చూప‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -