తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, వ్యాంప్ క్యారెక్టర్లకు కేరాఫ్‌గా నిలిచి మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు అపూర్వ. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పుడు రాజకీయ వేధింపులకు గురయ్యారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న చింతమనేని అనుచరులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. తన వైవాహిక జీవితంలోకి సైతం వచ్చి అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారంటూ అపూర్వ విరుచుకుపడ్డారు. తన పెళ్లి 1993లో అయ్యిందని కానీ తాను 1999లో అయ్యిందంటూ తన భర్తను వేధిస్తున్నట్లు ప్రెస్మీట్లు పెట్టి తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.
తన ఇంటి ముందు టీడీపీ దిమ్మ కడుతుంటే అడ్డుకున్నందుకే కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. తనను చింతమనేని తీవ్రంగా వేధించాడని.. ఆయన వల్లే గ్రామంలో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆరోపించారు. తనను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన భర్త తనకు తెలియకుండా వేరే పెళ్లి చేసుకుని పిల్లలను సైతం కన్నాడని ఆమె ఆరోపించారు.
మరోవైపు తాను బెదిరిస్తున్నానని, ఫోన్లు చేసి ఎస్పీ తెలుసు, పోలీసులు తెలుసు అంటూ తాను నిత్యం వేధింపులకు పాల్పడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను పదేళ్లుగా ఒకే నంబర్ వాడుతున్నానని కాల్ లిస్ట్ చెక్ చేసుకోవాలని సవాల్ విసిరారు.
తమపై చేసిన ఆరోపణలు నిజమని రుజువు అయితే నడిరోడ్డుపై ఉరితియ్యాలంటూ సవాల్ విసిరారు. తనను సీత అన్నా పర్వాలేదు, సిల్క్ స్మిత అన్నా పర్వాలేదని తాను సినీ ఇండస్ట్రీలో ఉన్నానని తెలిపారు. తనను రెచ్చగొట్టదన్న ఆమె రెచ్చగొడితే ఒక్కొక్కరి జాతకం బయటపెడతానని హెచ్చరించారు. జాతకాల బయటపెడితే నన్ను విమర్శించిన వాళ్ల పిల్లలకు పెళ్లి కాకుండా పోతాయ్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.