HomeSample Page

Sample Page Title

- Advertisement -

బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ ఖాన్​ వివాదంలో చిక్కుకున్నాడు. తనను సల్మాన్​ ఖాన్​.. ఆయన కంపెనీ ప్రతినిధులు మోసం చేశారంటూ చండీగఢ్​ కు చెందిన అరుణ్​ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేశాడు. సల్మాన్‌ ఖాన్‌, ఆయన సోదరి అల్విరా ఖాన్‌ అగ్నిహోత్రితో పాటు మరో ఏడుగురిపై సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సల్మాన్​ ఖాన్​ ఆయన సోదరి మరికొందరు కలిసి హ్యూమన్​ ఫౌండేషన్​ అనే ఓ సంస్థను నెలకొల్పారు. అయితే వీరు చండీగఢ్​ చెందిన వ్యాపారి అరుణ్​ గుప్తాతో ఓ ఒప్పందం చేసుకున్నారు.

హ్యూమన్​ ఫౌండేషన్​ ప్రాంచైజీ కింద చండీగఢ్​లో ఓ నగల దుకాణం పెట్టేందుకు సదరు వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ దుకాణాన్ని సల్మాన్​ ఖాన్​ ప్రారంభిస్తారని కూడా చెప్పారు. దీంతో అరుణ్​ గుప్త దాదాపు రూ. 3 కోట్లు ఖర్చుచేసి దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అయితే అరుణ్​ గుప్తకు హ్యూమన్​ ఫౌండేషన్​ నుంచి రావాల్సిన సరకు రాలేదు. అంతేకాక దుకాణం ఓపెన్​ చేసేందుకు సల్మాన్​ ఖాన్​ కూడా అంగీకరించలేదు. ఆయనకు పలు మార్లు ఉత్తరాలు రాశాడు. అంతేకాక కలుసుకోవాలని ప్రయత్నించిప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు.

- Advertisement -

’నేను సల్మాన్​ ఖాన్​ కంపెనీ ప్రతినిధులు మాటలు విని ఎంతో ఖర్చుచేసి దుకాణం ఏర్పాటు చేశాను. ఈ షాప్​ను ప్రారంభించేందుకు సల్మాన్​ ఖాన్​ ఒప్పుకున్నాడు. నన్ను బిగ్​బాస్​ హౌస్​కు కూడా తీసుకెళ్లారు. కానీ ప్రస్తుతం దుకాణం ఓపెనింగ్​కు రావడం లేదు. కనీసం స్పందించడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. అరుణ్‌ గుప్తా స్టేట్‌మెంట్‌ పరిశీలించిన ఎస్పీ కేతన్‌ బన్సాల్‌.. సల్మాన్‌ అండ్‌ టీమ్‌పై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. 13వ తేదీలోపు ఈ కేసుపై వివరణ ఇవ్వాలని సల్మాన్‌ను ఆదేశించినట్లుగా ఎస్పీ పేర్కొన్నారు.

Also Read

మా ఎన్నికలు: ప్రకాష్ రాజ్​ కు గట్టిగా బదులిచ్చిన నరేశ్​..!

ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ‘సౌత్ ఇండస్ట్రీయే’..!

జికా వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏమిటి?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -