Saturday, May 4, 2024
- Advertisement -

త‌న కుల‌, గోత్రాలు వెల్ల‌డించిన రాహుల్‌..

- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల వేల రాహుల్ గాంధీ కుల‌, గోత్రాల‌పై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కుల‌, గోత్రాలేంటో ఎవ‌రికి తెలియ‌వు. భాజాపా దీన్ని ఆయుధంగా వాడుకొని కొన్ని రోజులుగా రాహుల్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తోంది. రాజ‌స్థాన్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా….పుష్కర్ బ్రహ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోత్రం చెప్పాలని పూజారి అడిగిన నేపథ్యంలో… రాహుల్ తన వివరాలను వెల్లడించారు. తన కుటుంబానికి చెందిన పూర్వీకుల వివరాలతో పాటు తాను కౌల్ బ్రాహ్మణుడినని, తన గోత్రం దత్తాత్రేయ గోత్రమని రాహుల్ తెలిపారు. తాత,నాన్నమ్మ, తండ్రి ప్రధానులుగా పనిచేయగా వారి బాటలోనే తాను కూడా దేశ ప్రధాని పీఠాన్ని ఒక్కసారైనా అధిరోహించాలని రాహుల్ ఉవ్విళ్లూరుతున్నారు.

గత కొంత కాలంగా రాహుల్ కులగోత్రాలపై బిజెపి పార్టీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రశ్నలకు జవాబివ్వకుండా ఇన్నిరోజులు మౌనంగా వున్న రాహుల్ ఇవాళ వాటిని బైటపెట్టారు. ఇలా ఒకేసారి అటు బిజెపికి తగిన విధంగా జవాబివ్వడంతో పాటు పూజా కార్యక్రమాన్ని కూడా పూర్తిచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -