Monday, May 6, 2024
- Advertisement -

ఆయన ఆశలు ఫలిస్తాయా ?

- Advertisement -

ఆలేరు హస్తాన్ని చేతుల్లోకి తీసుకుందామని అనుకుంటున్నారాయన. బీసీ కేటగిరిలో భరిలో ఉంటానని చెబుతున్నారు. తనకు పోటీగా ఉన్న నాయకులు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం తనకు ప్లెస్‌ అవుతుందని భావిస్తున్నారు. మరి ఆలేరులో బీసీ యాంగిల్‌ ఈ సారి కూడా వర్కౌట్‌ అవుతుందా.. తనకు టికెట్‌ వస్తుందన్న నమ్మకంతో దూకుడు ప్రదర్శిస్తున్న ఆ నాయకుడు.. హస్తం సీటును కైవసం చేసుకోగలడా.. ఇంతకీ ఎవరా నాయకుడు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ సీటు తనకే వస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు బీర్ల ఐలయ్య పావులు కదుపుతున్నారు. బీసీలకే టికెట్‌ ఇస్తే గెలుస్తారనే సెంటిమెంట్‌ ఈ సారికూడా వర్కౌట్‌ అవుతుందని ఐలయ్య అనుకుంటున్నారటా.. అందుకే హస్తం పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా దాన్ని ముందుడి నడిపిస్తూ.. క్యాడర్‌ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

ఆలేరు యోనుంచి 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బుడిద బిక్షమయ్య గౌడ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 2014, 2018 ఎన్నికల్లో బిక్షమయ్య గౌడే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి. ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు ఓడిన బిక్షమయ్య గౌడ్‌.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఆ పార్టీకి చెందిన బీర్ల ఐలయ్యే దగ్గరుండి చూస్తున్నారు. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం క్యాడర్‌కు భరోసా ఇస్తూ వస్తున్నారు ఐలయ్య.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -