Friday, May 3, 2024
- Advertisement -

40 సంత్స‌రాల రాజ‌కీయ‌ జీవితంలో తొలిసారిగా రంగు మార్చిన బాబు..

- Advertisement -

రాష్ట్రంపై కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఏసీఎం చంద్ర‌బాబుతో పాటు ఎమ్మెల్యేలంతా న‌ల్ల చొక్కాలు ధ‌రించి అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌చ్చారు. రంగులు మార్చే ఊస‌ర‌వెళ్లిలాగా మాట‌లు మార్చ‌డంలో బాబు దిట్ట‌. ఇప్ప‌టికే అనేక సార్లు రుజువ‌య్యింది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎన్నిసార్లు మాట‌లు మార్చారాలో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికి తెలిసిందే. అయితే ఇదంతా ఎందుక‌నుకుంటున్నారు….?

బాబు 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ జీవితంలో మొద‌టి సారి రంగు మార్చారు. రంగు మార్చ‌డం ఏంటి అనుకుంటున్నారా…? బాబు డ్ర‌స్ విష‌యానికి వ‌స్తే…..ద‌శాబ్దాలుగా ముదురు గోధుమరంగు ప్యాంట్ పైన లేత గోధుమరంగు షర్ట్ వేసుకోవడం చంద్రబాబుకు అలవాటు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అకస్మాత్తుగా నల్లరంగు షర్ట్ తెలుపు రంగు ప్యాంట్ వేసుకుని అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌చ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందంటూ తీర్మానం చేస్తూనే – ప్రత్యక్షంగా కూడా నిరసన తెలపడం కోసం అంతా ఈ డ్రెస్ కోడ్ లోకి వచ్చేశారు.

చంద్రబాబునాయుడు నల్లచొక్కా ధరించడానికి రెండు కారణాలు చెబుతున్నారు టీడీపీ నేతలు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా, మరోవైపు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నిర్వహిస్తున్న ఆందోళనకు సంఘీభావంగా నల్లచొక్కాను ధరించినట్టు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -