ఏపీ సీఎం జగన్ నామినేటేడ్, కార్పొరేషన్ పదవుల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌కు అండగా నిలబడ్డ వాళ్లకు, వివిధ కారణాల వల్ల ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ రానివాళ్లకు పదవులు దక్కాయి. ఇక మహిళలకు, వెనకబడ్డ కులాల వాళ్లకు అవకాశాలు దక్కాయి.
ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ సిఫార్స్ వల్ల తమకు పదవులు దక్కలేదని కొందరు నేతలు విమర్శలు చేయగా.. ఆయన స్పందించారు. తాను ఎవరినీ సిఫార్సు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి సామాజిక వర్గ సమీకరణాలు, ఇతరత్రా అన్ని లెక్కలు వేసుకొని పదవుల పంపకం చేపట్టారని పేర్కొన్నారు.
Also Read: ‘భయం’ తెలియని వ్యక్తులే కాంగ్రెస్‌కు కావాలి..! రాహుల్ గాంధీ..!
‘ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా’ అంటూ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుత సీఎం జగన్ మాత్రం అన్ని వర్గాల వాళ్లకు న్యాయం చేస్తున్నారు. గతంలో కేవలం కొన్ని కులాలకు మాత్రమే కార్పొరేషన్ పదవులు దక్కేవి. కానీ ప్రస్తుతం రాష్ట్ర క్యాబినేట్ దగ్గర నుంచి అన్ని కీలక పోస్టులు అన్ని కులాల వాళ్లకు దక్కుతున్నాయి.’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అన్ని వర్గాల నేతలకు నామినేటేడ్ పదవులు అప్పగించారంటూ హర్షం వ్యక్తం అవుతున్నది.
Also Read: వైఎస్ షర్మిల ఎవ్వరో వదిలిన బాణం కాదు… అన్న వదిలిన బాణమే..!